Colleges: నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్!
ABN , Publish Date - Nov 19 , 2024 | 02:26 AM
ఫీజు రీ-యింబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులకు నిరసనగా ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల బంద్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి ప్రకటించారు.
ఫీజు రీ-యింబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులకు నిరసనగా ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల బంద్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి ప్రకటించారు.పెండింగ్ బిల్లుల కారణంగా కాలేజీలను నిర్వహించలేకపోతున్నట్టు వివరించారు. ఈ బిల్లులను చెల్లిస్తామని రెండు నెలల క్రితం ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు దానిని నెరవేర్చలేదని ఆయన చెప్పారు. అందుకే మంగళవారం నుంచి బంద్‌ను పాటిస్తున్నట్టు తెలిపారు.