Share News

కేసీఆర్ వైభవానికి పురాణపండ ‘శత్రుభయంకరం’ అవసరం.. పొన్నాలకు పండితుల రిక్వెస్ట్

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:40 AM

‘శత్రు భయంకరం’.. ఈ దివ్యగ్రంధానికి రచనా సంకలనకర్త నాటి శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు, రచయిత పురాణపండ శ్రీనివాస్. నాటి ప్రభుత్వంలో మంత్రిగా వున్న పొన్నాల లక్ష్మయ్య అప్పట్లో ఐదారు రకాల పుస్తకాలు అద్భుతంగా పురాణపండ శ్రీనివాస్‌చే రచింపచేసి, తాను ప్రచురించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందలకొలది ఆలయాలకు పంపడంవల్ల ఈ నాటికీ కొన్ని చోట్ల పొన్నాల లక్ష్మయ్య బుక్స్‌నే పారాయణం చేస్తూ కనిపిస్తున్నారు.

కేసీఆర్ వైభవానికి పురాణపండ ‘శత్రుభయంకరం’ అవసరం.. పొన్నాలకు పండితుల రిక్వెస్ట్

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 22: ఇటీవల ఒక చోట సమావేశమైన తెలంగాణ పండిత అర్చక సమావేశంలో తెలంగాణలో రాజకీయయోధాగ్రేసరుడైన మొట్టమొదటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నాటి ఐ.టి. శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య గురించి సుదీర్ఘమైన చర్చ వచ్చింది. పదేళ్ల నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐ.టి.శాఖామంత్రిగా సమర్ధ సేవలందించిన పొన్నాల లక్ష్మయ్య అప్పట్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చినప్పుడు తానే స్వయంగా, తన అనుచర సహచరులతో కలసి ఒక అద్భుతమైన గ్రంధాన్ని పంచారు. యాదగిరిగుట్టలో భక్తజన సముద్రం మధ్యనే ఆయనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు కూడా. ఈ భక్తి గ్రంధానికి సమర్పకులు కూడా పొన్నాల లక్ష్మయ్య దంపతులే కావడం గమనార్హం.

అపూర్వమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చిత్రాలతో, అద్భుతమైన స్తోత్రాలతో, రమణీయమైన వ్యాఖ్యానాలతో వేలకొలది భక్తులను ఆకట్టుకున్న ఈ పుస్తకం పేరు ‘శత్రు భయంకరం’. ఈ దివ్యగ్రంధానికి రచనా సంకలనకర్త నాటి శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు, రచయిత పురాణపండ శ్రీనివాస్. నాటి ప్రభుత్వంలో మంత్రిగా వున్న పొన్నాల లక్ష్మయ్య అప్పట్లో ఐదారు రకాల పుస్తకాలు అద్భుతంగా పురాణపండ శ్రీనివాస్‌చే రచింపచేసి, తాను ప్రచురించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందలకొలది ఆలయాలకు పంపడంవల్ల ఈ నాటికీ కొన్ని చోట్ల పొన్నాల లక్ష్మయ్య బుక్స్‌నే పారాయణం చేస్తూ కనిపిస్తున్నారు. అందులోనూ పురాణపండ శ్రీనివాస్ రచనా శైలి, ముద్రణ తీరు అపురూపం, విలక్షణం. పరమ సౌందర్యభరితం. పొన్నాల ప్రచురించిన ఈ ‘శత్రుభయంకరం’ గ్రంధాన్ని ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎల్వీ. సుబ్రహ్మణ్యం తాను నిత్యం పారాయణం చేసేవాణ్ణని, ఈ మంగళ గ్రంధం పురాణపండ శ్రీనివాస్ పరిచయభాగ్యాన్ని కలుగచేసిందని, తానెన్నో విజయాల్ని గ్రంధం ద్వారా పొందానని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఈ ‘శత్రుభయంకరం’ గ్రంధంలోని అంశాలు ఎంతటి ఆపదనైనా తరిమి కొడతాయని సుబ్రహ్మణ్యం బాహాటంగానే చెప్పారు.

KCR.jpg

అంతేకాదు మహా మహోపన్యాసకులైన మహాత్ములు చాగంటి కోటేశ్వరరావుకు కూడా పొన్నాల లక్ష్మయ్య సన్నిహితులు ఆనాడే ఈ శత్రుభయంకరం గ్రంధాన్ని అందజేయడంతో ఆయన పురాణపండ, పొన్నాలపై ప్రశంసల వర్షం కురిపించారనేది నిర్వివాదాంశం. అయితే ఇప్పడు రాజకీయ కారణాల వల్ల పొన్నాల లక్ష్మయ్య మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వర్గంలో ఉండటంతో తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు ఇలాంటి గ్రంధం పొన్నాల లక్ష్మయ్య కె.సి.ఆర్ ఫోటో ప్రచురించి యావత్ తెలంగాణ సమాజంలోని బీఆర్‌ఎస్ శ్రేణులకు ఉచితంగా ఇవ్వొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం పార్టీకి ఎంతో అవసరమని సీనియర్ నాయకులు సైతం ఈ గ్రంధాన్ని పొన్నాల మళ్ళీ ప్రచురించి కె.సి.ఆర్ చేత ఆవిష్కరింప చేస్తే అద్భుతాలు జరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Ponnala.jpg

పురాణపండ శ్రీనివాస్ తీసిన ఒక్కొక్క పుస్తకానికి ఇలాంటి డిమాండే ఉంటుందని కేసీఆర్ వ్యక్తిగత పూజారులైన పండితులు కూడా పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం నిర్వహణా సామర్ధ్యంతో ఎన్నెన్నో రచనా సంకనాల బిజీలో ఉన్న పురాణపండకు, పొన్నాలకు ఇది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుని కటాక్షం కాక మరేమిటి?! ఏది ఏమైనా పొన్నాల లక్ష్మయ్య శత్రుభయంకరం గ్రంధం ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ పవిత్ర సంచలనం సృష్టిస్తోంది.

Updated Date - Apr 23 , 2024 | 07:57 AM