Share News

Free Bus Scheme: మహిళ తిట్లు.. డ్రైవర్ పాట్లు.. ఆగిపోయిన బస్సు!

ABN , Publish Date - May 09 , 2024 | 06:19 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం పథకం’ మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది కానీ.. బస్సు డ్రైవర్లకు మాత్రం లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది! టిక్కెట్టు లేని ప్రయాణం..

Free Bus Scheme: మహిళ తిట్లు.. డ్రైవర్ పాట్లు.. ఆగిపోయిన బస్సు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం పథకం’ (Free Bus For Women) మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది కానీ.. బస్సు డ్రైవర్లకు మాత్రం లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది! టిక్కెట్టు లేని ప్రయాణం కావడంతో.. మహిళలందరూ ఒక ఉద్యమంలా బస్సులను వాడేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. కనీసం ఊపిరి పీల్చుకునే చోటు కూడా లేనంతగా.. ఇబ్బడిముబ్బడిగా బస్సులు ఎక్కేస్తున్నారు. ఈ దెబ్బకు బస్సులు ఓవర్‌లోడ్ అయ్యి.. ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయాల్లో డ్రైవర్లు తీవ్ర ఆగ్రహావేశాలకు గురై.. ఎక్కడికక్కడే బస్సులను ఆపేస్తున్నారు. తాజాగా ఇలాంటి పరిణామమే హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో చోటు చేసుకుంది.


ముంబై ఇండియన్స్‌కి రోహిత్ శర్మ గుడ్ బై..?

నేను నడపలేను!

కోఠివైపుకి వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు లక్డీకాపూల్ ప్రాంతంలోనే ఓవర్ లోడ్ అయ్యింది. దీంతో.. బస్సుని నడపడం డ్రైవర్‌కి కష్టతరం అయ్యింది. సరిగ్గా అదే సమయంలో ఓ మహిళ బస్సు ఎక్కేందుకు రాగా, డ్రైవర్ ఆమెని ఎక్కించుకోలేదు. ఇప్పటికే బస్సు ఓవర్‌లైడ్ అయ్యిందని, మరో బస్సు ఎక్కి వెళ్లాలని సూచించాడు. కానీ.. ఆమె పట్టించుకోకుండా రివర్స్‌లో డ్రైవర్‌పైనే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోపాద్రిక్తుడైన డ్రైవర్ బస్సు నుంచి కిందకు దిగాడు. ‘నేను బండి నడపలేను, నువ్వు తీసుకొని వెళ్లు’ అంటూ ఆ మహిళపై కసురుకున్నాడు. ఇందుకు ఆ మహిళ బదులిస్తూ.. ‘‘ఈ బస్సేమైనా నీ సొంతమా? ఇది ప్రభుత్వ ఆస్తి’’ అంటూ తీవ్రంగా మండిపడింది. ఎక్కించుకుంటావా? లేదా? అంటూ అడ్డం తిరిగింది.

చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. టీ20 క్రికెట్‌లో ఆల్‌టైం రికార్డ్

ఇదేం విడ్డూరమో!

దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ డ్రైవర్.. నడిరోడ్డుపైనే బస్సు ఆపేశాడు. తాను బస్సు నడపలేను మహాప్రభో అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పాపం.. ఆ డ్రైవర్ దుస్థితిని అర్థం చేసుకోకుండా, ఇతర మహిళలు సైతం అతనిపై విరుచుకుపడ్డారు. అసలు ఉచిత బస్సు ఎవరు పెట్టమన్నారంటూ అందరూ ధ్వజమెత్తారు. ఇదెక్కడి పంచాయితీరా బాబు అంటూ.. ఆ డ్రైవర్ లబోదిబోమంటూ మొరపెట్టుకున్నాడు. ఉచిత బస్సు పెట్టి.. తమ ప్రాణాల మీదకు తెస్తున్నారంటూ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రచ్చ అంతా ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో చర్చకు దారితీశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 09 , 2024 | 07:38 PM