Share News

CM Chandrababu: ఎస్సీ వర్గీకరణ రూపశిల్పి చంద్రబాబు

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:31 AM

ఎస్సీ వర్గీకరణ రూపశిల్పి ఏపీ సీఎం చంద్రబాబు అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

CM Chandrababu: ఎస్సీ వర్గీకరణ రూపశిల్పి చంద్రబాబు

  • వర్గీకరణ మార్గదర్శి బాలగోపాల్‌: మందకృష్ణ

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ రూపశిల్పి ఏపీ సీఎం చంద్రబాబు అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం చంద్రబాబు నివాసానికి వెళ్లిన మందకృష్ణ.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో వర్గీకరణను త్వరగా అమల్లోకి తేవాలని కోరారు. మడమ తిప్పని పోరాటంతో మంద కృష్ణ విజయం సాధించారని చంద్రబాబు అభినందించారు.


కాగా, మానవ హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్‌ రచనలే వర్గీకరణకు దారిచూపాయని మంద కృష్ణ అన్నారు. బాలగోపాల్‌ ఇంటికి వెళ్లి ఆయన సతీమణి వసంతలక్ష్మిని కలిశారు. వర్గీకరణను రద్దు చేస్తూ 2004లో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ.. వర్గీకరణ ఆవశ్యకతపై బాలగోపాల్‌ రచనలు చేశారని గుర్తు చేశారు. రిజర్వేషన్లపై బాలగోపాల్‌ రాసిన పుస్తకాన్ని వసంతలక్ష్మి.. మంద కృష్ణకు అందించారు.

Updated Date - Aug 25 , 2024 | 04:31 AM