DGP Office: డీజీపీ కార్యాలయం వద్ద భద్రత కుదింపు!
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:09 AM
తెలంగాణ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం(డీజీపీ ఆఫీస్) వద్ద భద్రత తగ్గించారు. ప్రధాన కార్యాలయం వద్ద గత కొన్నేళ్లుగా ఇంటర్సెప్టర్ వాహనంతో సాయుధులైన సిబ్బంది విధుల్లో ఉండేవారు.
8 ఇంటర్సెప్టర్ వాహనం తొలగింపు
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం(డీజీపీ ఆఫీస్) వద్ద భద్రత తగ్గించారు. ప్రధాన కార్యాలయం వద్ద గత కొన్నేళ్లుగా ఇంటర్సెప్టర్ వాహనంతో సాయుధులైన సిబ్బంది విధుల్లో ఉండేవారు. పోలీసు ప్రధాన కార్యాలయం కావడంతో కట్టుదిట్టమైన భద్రత చర్యల్లో భాగంగా ఇంటర్సెప్టర్ వాహనం గేటు వద్ద ఉంచేవారు. గత వారం రోజులుగా అధికారులు ఆ వాహనాన్ని భద్రత విధుల నుంచి తప్పించారు.
హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో గస్తీకి అవసరమంటూ నగర పోలీసులు డీజీపీ కార్యాలయం వద్ద ఉన్న ఆ వాహనాన్ని తొలగించారు. కాగా టీఎ్సఎ్సపీ బెటాలియన్ సిబ్బందితోపాటు సిటీ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది డీజీపీ కార్యాలయం భద్రతలో ఉంటారు. వీరితో పాటు గ్రేహౌండ్స్ విభాగంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిటీ పోలీసుల నుంచి 8 మంది సిబ్బంది రెండు విడతల్లో భద్రత విధుల్లో ఉంటారు. డీజీపీతో సహా కీలక అధికారులు ఉండే కార్యాలయం, నిత్యం రాజకీయ, ఇతర ప్రముఖులు రాకపోకలు సాగించే ప్రదేశంలో సాయుధులైన సిబ్బంది గేటు వద్ద కనిపించకపోవడం వల్ల భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.