Home » DGP Ravi Gupta
తెలంగాణ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం(డీజీపీ ఆఫీస్) వద్ద భద్రత తగ్గించారు. ప్రధాన కార్యాలయం వద్ద గత కొన్నేళ్లుగా ఇంటర్సెప్టర్ వాహనంతో సాయుధులైన సిబ్బంది విధుల్లో ఉండేవారు.
వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ ఆరోపించారు.
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ భగ్గుమంది. మునుపెన్నడూ లేని విధంగా... అసాధారణ రీతిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు, 12 మంది దిగువస్థాయి పోలీసు అధికారులపై బదిలీ, సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై మండిపడింది.
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తవ్వడానికి తెలంగాణ పోలీసుల......
తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఈమేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అదనపు డీజీపీలు మహేష్ ఎం భగవత్, సంజయ్ కుమార్ జైన్లు డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ను స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు.
Telangana: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్త తెలిపారు. ఆదివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని కోరారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Election 2024) కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశామని చెప్పారు. శనివారం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచారు. ఈ కేసులో మరో ఇద్దరిని.. పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కాగా ఈ కేసుపై తెలంగాణ డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ (Congress) నాయకులు బండి సుధాకర్, సమ్మిరెడ్డి గురువారం నాడు కలిసి ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు(Andhra Pradesh) వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఫైర్ అయ్యారు. ప్రధానంగా డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీజీపీకి టైమ్ దగ్గర పడింది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల వాహనాలు మాత్రమే తనిఖీ చేయమని డీజీపీ(AP DGP) ఆదేశాలు ఇచ్చినట్లు కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారన్నారు. పార్టీ అంతర్గత సమావేశంలో..
భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలుల్లో జరుగుతున్న అన్యాయంపై ఈనెల 8వ తేదీన ధర్నాను తలపెట్టారు.