Share News

DGP Ravi Gupta :ఫలించిన వ్యూహం.. ప్రశాంతంగా పోలింగ్‌

ABN , Publish Date - May 14 , 2024 | 04:55 AM

పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తవ్వడానికి తెలంగాణ పోలీసుల......

DGP Ravi Gupta :ఫలించిన వ్యూహం.. ప్రశాంతంగా పోలింగ్‌

సిబ్బందికి డీజీపీ రవిగుప్తా అభినందనలు

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తవ్వడానికి తెలంగాణ పోలీసుల వ్యూహం ఫలించింది. మావోయిస్టు ప్రభావిత సరిహద్దు జిల్లాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. కమిషనర్లు, ఎస్పీలు స్వయంగా క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి సమీక్షించారు. సిబ్బందికి డీజీపీ రవిగుప్తా అభినందనలు తెలిపారు.

Updated Date - May 14 , 2024 | 04:55 AM