TG Politics: కేసీఆర్ ఫాంహౌస్‌లో ఆ వార్ రూం.. డీజీపీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
ABN , Publish Date - Mar 28 , 2024 | 06:00 PM
తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచారు. ఈ కేసులో మరో ఇద్దరిని.. పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కాగా ఈ కేసుపై తెలంగాణ డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ (Congress) నాయకులు బండి సుధాకర్, సమ్మిరెడ్డి గురువారం నాడు కలిసి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచారు. ఈ కేసులో మరో ఇద్దరిని.. పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కాగా ఈ కేసుపై తెలంగాణ డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ (Congress) నాయకులు బండి సుధాకర్, సమ్మిరెడ్డి గురువారం నాడు కలిసి ఫిర్యాదు చేశారు.
Big Breaking: గండిపేటలో భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన 25 కార్లు..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌజ్‌ను తనిఖీ చేయాలని కోరారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో కూడా వార్ రూం ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిన ఆస్తుల వివరాలు బయట పెట్టాలని కోరారు. ఏసీబీ , ఈడీ ద్వారా ఈ కేసును దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
Barrelakka Marriage: సందడే సందడి.. వెంకటేష్‌తో బర్రెలక్క ఏడడుగులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి