Home » TG Politics
రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరి.. మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కావోస్తుంది. ఈ నేపథ్యంలో సంబురాలు నిర్వహించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. అందుకోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం గాంధీ భవన్లో పార్టీ అగ్రనేతలు భేటీ కానున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని ఇప్పుడు అభివృద్ధి చేసుకోకపోతే ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేమని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై మెున్న జరిగిన దాడిలో ఎంత మంది ఉన్నారో వారందరిపై విచారణ జరిపి కేసులు పెడతామని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రూ.8,888 కోట్ల విలువైన అమృత్ పథకం టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటి వరకూ ప్రైవేటులో ఉన్నత వర్గాలకు మాత్రమే డే కేర్ సెంటర్లు అందుబాటులో ఉండగా.. సర్కారు ఆధ్వర్యంలో పేదల కోసం ‘క్రెష్’లు ఏర్పాటు కానున్నాయి.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. డిపాజిటర్ల (ఇన్వెస్టర్స్) వివరాలను ఎలక్ర్టానిక్ రూపంలో ప్రెన్డ్రైవ్ ద్వారా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు అందజేయాలని ఆదేశించింది.
వరదల సమయంలో తరలించే నీటిని వినియోగం కింద లెక్కించొద్దనే ప్రధాన ఎజెండాపై చర్చించడానికి వీలుగా రిజర్వాయర్ నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ)ని పునరుద్ధరిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సంచలన నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీశాయని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్‌రెడ్డి తెలిపారు.
‘‘తప్పు చేసిన వారికి నాటు బాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటం బాంబు పేలబోతోంది. బీఆర్ఎస్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పుల మీద తప్పులు చేసిన వారిని ఉపేక్షించేది లేదు.
ఫార్ములా-ఈ కారు రేసులకు సంబంధించి నిధుల విడుదలలో ఏ తప్పూ జరగలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.