Share News

Hyderabad : ఏసీబీ చీఫ్‌గా విజయ్‌ కుమార్‌

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:29 AM

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ నియమితులయ్యారు.

Hyderabad : ఏసీబీ చీఫ్‌గా విజయ్‌ కుమార్‌

  • హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌

  • విజిలెన్స్‌ డీజీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

  • పలువురికి అదనపు బాధ్యతలు

  • వినాయక చవితి సమయంలో ఊహించని రీతిలో బదిలీలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులిచ్చారు. ఆయనతోపాటు.. పలువురు ఐపీఎ్‌సలను బదిలీ చేశారు. 1997 బ్యాచ్‌కు చెందిన విజయ్‌కుమార్‌ ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో సీవీ ఆనంద్‌ నుంచి డీజీగా బాధ్యతలు స్వీకరించారు.సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ మరోమారు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన సోమవారం ఉదయం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఐసీసీసీ)లో బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డిని విజిలెన్స్‌ డైరెక్టర్‌గా నియమించారు. అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌కు పర్సనల్‌, సంక్షేమం అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐజీ ఎం.రమేశ్‌కు ఐజీ స్పోర్స్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.


  • గణేశ్‌ నవరాత్రుల సమయంలో..

హైదరాబాద్‌ నగరంలో గణేశ్‌ నవరాత్రుల నిర్వహణ పోలీసులకు అత్యంత క్లిష్టమైన టాస్క్‌. ఇది సవ్యంగా పూర్తయితే.. ‘బడేఖానా’ పేరుతో సీపీ నుంచి కానిస్టేబుల్‌ దాకా ప్రతి ఒక్కరూ పాల్గొనేలా అభినందన సభను నిర్వహించుకుంటారు. 2 నెలల క్రితమే రేవంత్‌ సర్కారు డీజీపీ సహా.. సీనియర్‌ ఐపీఎ్‌సలను బదిలీ చేసింది. దాంతో ఇక సీనియర్‌ ఐపీఎ్‌సల బదిలీలు ఉండవని అంతా అనుకున్నారు. ఊహించని రీతిలో వినాయక చవితిరోజునే హైదరాబాద్‌ సీపీ బదిలీ జరిగింది. సీవీ ఆనంద్‌కంటే.. డీజీపీ జితేందర్‌ ఒక సంవత్సరం జూనియర్‌ కావడం తెలంగాణ పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Sep 09 , 2024 | 04:29 AM