Share News

బంగారం, వెండితో ‘సీతారాముల’ పట్టుచీర

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:47 AM

బంగారం, వెండిని ఉపయోగించి సీతారాముల ప్రతిరూపంతో పట్టుచీరను తయారు చేశారు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు యెల్ది హరిప్రసాద్‌. శ్రీరామనవమి సందర్భంగా

బంగారం, వెండితో ‘సీతారాముల’ పట్టుచీర

సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్‌ ప్రతిభ

సిరిసిల్ల, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): బంగారం, వెండిని ఉపయోగించి సీతారాముల ప్రతిరూపంతో పట్టుచీరను తయారు చేశారు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు యెల్ది హరిప్రసాద్‌. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణం కోసం దీనిని తయారుచేశారు. ఈసారి చీరపై సీతారాముల కల్యాణ వేడుక ప్రతిరూపాలను, శంకుచక్రనామాలు, చీర అంచు లో ‘జై శ్రీరామ్‌’ నామాలను పొందుపరిచారు. 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో 800గ్రాముల బరువున్న చీరలో 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండిని ఉపయోగించారు.

Updated Date - Apr 16 , 2024 | 03:47 AM