Share News

1,465 కి.మీ మేర ‘కవచ్‌’ విస్తరణ

ABN , Publish Date - Nov 16 , 2024 | 04:14 AM

రైలు ప్రమాదాల నివారణ కోసం వినియోగంలోకి వచ్చిన ఆటోమేటిక్‌ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్‌’ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,465 కి.మీ మేర ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

1,465 కి.మీ మేర ‘కవచ్‌’ విస్తరణ

  • సనత్‌నగర్‌-వికారాబాద్‌ మార్గంలో 63 కి.మీలలో అప్‌గ్రేడ్‌

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రైలు ప్రమాదాల నివారణ కోసం వినియోగంలోకి వచ్చిన ఆటోమేటిక్‌ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్‌’ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,465 కి.మీ మేర ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైళ్ల ప్రమాదాలను నియంత్రించేందుకు స్వదేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్‌ 4.0 వెర్షన్‌ను తాజాగా సనత్‌నగర్‌-వికారాబాద్‌ మార్గంలో 63 కి.మీ మేర అప్‌గ్రేడ్‌ చేశామని తెలిపారు.


కవచ్‌ 4.0 రక్షణ వ్యవస్థను రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్ట్స్‌ ఆర్గనైజేషన్‌(ఆర్‌డీఎ్‌సవో) సహకారంతో భారతీయ రైల్వే అభివృద్ధి చేసింది. నాగర్‌సోల్‌-ముద్ఖేడ్‌-ధర్మాబాద్‌-నిజామాబాద్‌, సికింద్రాబాద్‌- కర్నూల్‌ సిటీ, డోన్‌, గుంతకల్‌ విభాగంలో 959 కి.మీ మేర కవచ్‌ 3.2 రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే వికారాబాద్‌-బీదర్‌ మధ్య 90 కి.మీలు, వికారాబాద్‌-వాడి మార్గంలో 112 కి.మీ మేర కవచ్‌ను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 04:14 AM