Share News

Regional Ring Road: దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌ భూముల విలువ డబుల్‌!

ABN , Publish Date - Sep 06 , 2024 | 03:10 AM

రీజనల్‌ రింగ్‌ రోడ్డులో భాగంగా దక్షిణ భాగంలో భూములను కోల్పోతున్న అన్నదాతలకు కొంతలో కొంత ఊరట!

Regional Ring Road: దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌ భూముల విలువ డబుల్‌!

  • ఉమ్మడి మెదక్‌లో సేకరించే భూముల విలువ పెంపు

  • ఈ నెల 1 నుంచే ధరణిలో అందుబాటులోకి

  • కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఉన్న ఎర్రవెల్లిలో రెట్టింపు పైగా..

హైదరాబాద్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రీజనల్‌ రింగ్‌ రోడ్డులో భాగంగా దక్షిణ భాగంలో భూములను కోల్పోతున్న అన్నదాతలకు కొంతలో కొంత ఊరట! మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట రెవెన్యూ జిల్లాల మీదుగా వెళ్లే రోడ్డు మార్గం కోసం సేకరించనున్న భూముల రికార్డు విలువను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఉన్న.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని మర్కూక్‌ మండలం ఎర్రవల్లి గ్రామంలోని ఓ రెండు సర్వేనంబర్ల భూముల రేట్లు రెట్టింపునకు పైగా పెరిగాయి! సంగారెడ్డి జిల్లా కలాబ్‌గుర్‌లోనూ ఇంతే.


మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు అతి సమీపంలో అత్యంత ఖరీదైన.. రెండు పంటలు పండే నాగులపల్లిలో సేకరించనున్న 105 ఎకరాల భూమి విలువ దాదాపుగా రెండింతలకు పైగా పెరిగింది. మొత్తమ్మీద ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం భూసేకరణ విషయంలో ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే నిజమైంది. సౌత్‌ అలైన్‌మెంట్‌ పరిధిలో సేకరించనున్న భూముల విలువను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 3వ తేదీన ‘రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగంలో పెంచనున్న భూముల విలువపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. పెంచిన విలువలు సెప్టెంబరు 1నే ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. ఎన్‌హెచ్‌ అధికారులు ఇచ్చిన అలైన్‌మెంట్‌ పరిధిలో భూసేకరణకు తీసుకునే భూముల వరకే రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ధరలు పెంచారు.


  • భూ సేకరణ పరిధిలో జిల్లాల వారీగా పెంపు ఇలా.. (ఎకరా చొప్పున)

సిద్దిపేట జిల్లాలో: గజ్వేజ్‌ సబ్‌రిజిస్టార్‌ కార్యాలయం పరిధిలోని బేగంపేట్‌లో సర్వే నంబరు 285 నుంచి 390 మధ్యలో ఉన్న కొన్ని సర్వే నంబర్లలో ఎకరం భూమి విలువ రూ.2,62,500గా ఉండగా రూ.5,82,750కి పెంచారు. యాక్తల్‌లో సర్వే నంబరు 122 నుంచి 148 మధ్యలో ధర రూ.2,25,000 ఉండగా రూ.4,99,500 వరకు పెంచారు. బంగా వెంకటాపూర్‌లో సర్వే నంబరు 265 నుంచి 276 మధ్య రూ.3,37,500 ఉండగా, రూ.8,30,250కు పెంచారు. మక్తా మాసాన్‌పల్లిలో సర్వే నంబరు 39 నుంచి 111 మధ్య రూ.3,37,500 ఉండగా రూ.8,30,250కు పెంచారు. ముతరాజ్‌పల్లిలో సర్వే నంబరు 326, 331లో రూ.6,75,000 ఉండగా రూ.14,98,500 వరకు పెంచారు.


ప్రజ్ఞాపూర్‌ పరిధిలో సర్వే నంబరు 253లో రూ.7,87,500 ఉండగా రూ.17,48,250 దాకా పెంచారు. ఇదే గ్రామంలో ఉన్న సర్వేనంబర్లు 356, 2578 పరిధిలో రూ.21 లక్షలు ఉండగా రూ.22,05,000 వరకు పెంచారు. వర్గల్‌ మండలం జబ్బాపూర్‌ పరిధిలో సర్వే నంబరు 14 నుంచి 206 మధ్య రూ.4,50,000 ఉండగా రూ.8,32,500 వరకు పెంచారు. ఇదే మండలం మైలారమ్‌ గ్రామంలో సర్వే నంబర్లు 74,75,78,79,80 పరిధిలో రూ.5,25,000 ఉంటే దాన్ని రూ.9,71,250కు పెంచారు. నెమ్‌టూర్‌ పరిధిలో సర్వే నంబరు 69 నుంచి 1131 మధ్య ఉన్న సర్వే నంబర్లలో రూ.4,50,000 ఉండగా రూ.8,32, 500 పెంచారు.


సంగారెడ్డి జిల్లాలో: సంగారెడ్డి సమీపంలోని నాగపూర్‌లో సర్వే నంబరు 171, 181 మధ్య ఎకరా ధర రికార్డు విలువ రూ. 7,50,000గా ఉంది. దీన్ని రూ.18,75,000 పెంచారు. ఇరిగిపల్లిలోనూ సర్వే నంబరు 69 నుంచి 77 మధ్యలో భూములకు ఇదే పెంపు వర్తింపజేశారు. కలాబ్‌గుర్‌లో సర్వే నంబరు 479 నుంచి 589 మధ్య రూ.7,50,000 నుంచి రూ.18,75,000కు పెంచారు. తాడ్లపల్లిలో సర్వే నంబరు 141 నుంచి 409 మధ్య ఉండే భూముల విలువను కలాబ్‌గుర్‌ పెంపునే వర్తింపజేశారు. సంగారెడ్డి మండలం చింతపల్లిలో సర్వే నంబరు 12 నుంచి 208 మధ్య రూ.7,50,000 నుంచి 25,41000 వరకు ఉండగా ఈ ప్రాంతంలో అన్ని భూముల విలువలను రూ.25,41,000 చేశారు.


  • సీఆర్‌ ఫాంహౌస్‌ ఉన్న ఎర్రవెల్లిలో

సిద్దిపేట జిల్లా మార్కుక్‌ మండలం అనగాడి కిష్టాపూర్‌లో సర్వే నంబరు 88, 89, 92 పరిధిలో సేకరించే భూములకు సంబంధించి ప్రస్తుతం ఎకరా రికార్డు విలువ రూ.2,25,000 ఉండగా దాన్ని రూ. 4,99,500 పెంచారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఉన్న ఎర్రవెల్లిలో సర్వే నంబరు 111, 112 పరిధిలో రూ.2,70,000 ఉండగా దాన్ని రూ.5,99,400 పెంచారు. ఇదే మండలం చెబర్తిలో సర్వే నంబరు 31 నుంచి 458 మధ్య రూ.3,15,000 ఉండగా రూ.6,99,300 పెంచారు. పాములపర్తిలో సర్వే నంబరు 230 నుంచి 925 మధ్య రూ.5,25,000 ఉండగా రూ.11,65,500 వరకు పెంచారు. జగదేవ్‌పూర్‌ మండలం ఇటిక్యాల పరిధిలో సర్వే నంబరు 76 నుంచి 366 మధ్య రూ.2,70,000 ఉండగా రూ.5,99,000 వరకు పెంచారు. పీర్లపల్లి పరిధిలో సర్వే నంబరు 185 నుంచి 399 మధ్య రూ.2,25,000 ఉండగా రూ.4,99,500 వరకు పెంచారు.

Updated Date - Sep 06 , 2024 | 03:10 AM