Share News

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు

ABN , Publish Date - Apr 12 , 2024 | 03:14 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని సవాలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్ట్ కొట్టివేసింది. ఇక సీబీఐ కస్టడీకి అప్పగించడానికి సంబంధించిన పిటిషన్‌పై తీర్పును కోర్ట్ రిజర్వ్ చేసింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మరోసారి చుక్కెదురైంది. సీబీఐ (CBI) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని సవాలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్ట్ కొట్టివేసింది. ఇక సీబీఐ కస్టడీకి అప్పగించడానికి సంబంధించిన పిటిషన్‌పై తీర్పును కోర్ట్ రిజర్వ్ చేసింది. దీనిపై కాసేపట్లో తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించేందుకు కవితను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు.


మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రకు సంబంధించిన కీలక విషయాలను సీబీఐ బహిర్గతం చేసింది. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో తెలిపింది. కవిత జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు పేర్కొంది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని పేర్కొంది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారంది.

ఇవి కూడా చదవండి

Delhi Liquor Scam: కవిత దందాలను బయటపెట్టిన సీబీఐ.. వామ్మో ఇలా చేశారా!?

Harish Rao: కాంగ్రెస్‌పై ప్రజలకు కోపం వచ్చింది.. అలా చేశారంటే మాత్రం ఇక అంతే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2024 | 03:28 PM