TGRTC: శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Nov 03 , 2024 | 04:28 AM
కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని టీజీఎ్‌సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రధానంగా శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర ఆలయాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు.
అరుణాచలం, పంచారామాలకు ప్యాకేజీలు: సజ్జనార్
హైదరాబాద్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని టీజీఎ్‌సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రధానంగా శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర ఆలయాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీ అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వివరించారు.
ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను ్టజటట్టఛిఛఠట.జీుఽ వెబ్సైట్లో చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు. అద్దె ప్రాతిపదికన (బస్ ఆన్ కాంట్రాక్ట్ - బీవోసీ) నడిపే ఆర్టీసీ బస్సుల చార్జీలు తగ్గించామని సజ్జనార్ తెలిపారు. పల్లె వెలుగు కిలోమీటర్‌కు రూ.11, ఎక్స్‌ప్రెస్ రూ.7, డీలక్స్ రూ.8, సూపర్ లగ్జరీ రూ.6, రాజధాని రూ.7 మేర తగ్గించినట్టు ఆయన పేర్కొన్నారు. శబరిమలకు, శుభముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.