Share News

journalism: తెలుగు పాత్రికేయ రంగంలో వి.హనుమంతరావు పాత్ర ప్రత్యేకం

ABN , Publish Date - Aug 31 , 2024 | 04:42 AM

తెలుగు పాత్రికేయ రంగంలో ప్రముఖ పాత్రికేయుడు వి.హనుమంతరావు పాత్ర చాలా ప్రత్యేకమైందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.

journalism: తెలుగు పాత్రికేయ రంగంలో వి.హనుమంతరావు పాత్ర ప్రత్యేకం

  • రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు

  • విలేకరుల స్వేచ్ఛ సన్నగిల్లిందని వ్యాఖ్య

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): తెలుగు పాత్రికేయ రంగంలో ప్రముఖ పాత్రికేయుడు వి.హనుమంతరావు పాత్ర చాలా ప్రత్యేకమైందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. పత్రికల్లో అచ్చు అక్షరాన్ని భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అంతటి పవిత్రంగా ఆరాధించిన ఒకనాటి స్వర్ణయుగంలో ఆయన జర్నలిస్టుగా రాణించార ంటూ కొనియాడారు. పాత్రికేయుల ఆరోగ్య సంక్షేమం కోసం దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని సంప్రదించి, వారిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు హనుమంతరావు ఎంతో కృషి చేశార న్నారు.


ప్రస్తుతం విలేకరుల స్వేచ్ఛ సన్నగిల్లిందని ఆయన పేర్కొన్నారు. వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయుడు వి.హనుమంతరావు శత జయంతి సభ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. కార్యక్రమంలో కేవీపీ మాట్లాడుతూ.. కొన్ని క్లిష్టమైన అంశాలపై సలహాలు, సూచనల కోసం వైఎ్‌స ప్రభుత్వం ఆయన్ను సంప్రదించిన సందర్భాలున్నాయన్నారు. అలాంటి ప్రజా పాత్రికేయుడి స్ఫూర్తిని, ఆనాటి పాత్రికేయ విలువలను ఈతరం జర్నలిస్టులకు తెలియజేసేలా తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ప్రత్యేక సదస్సులు, శిక్షణా తరగతులు లాంటివి నిర్వహించాలని సూచించారు.


దీనిపై అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రముఖ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ...ఆర్థికరంగానికి సంబంధించిన గణాంకాలు, లెక్కల్లో హనుమంతరావు కదిలే విజ్ఞాన కేంద్రమని ప్రశంసించారు. వీక్షణం మాస పత్రిక వ్యవస్థాపకుడిగా హనుమంతరావు సేవలను ఎన్‌.వేణుగోపాల్‌ వివరించారు. కార్యక్రమంలో హనుమంతరావు జీవిత భాగస్వామి సరళ, కుమారుడు జర్నలిస్టు డైరీ సతీ్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 04:42 AM