Share News

Medaram: మేడారం హుండీల లెక్కింపు నేడు..

ABN , Publish Date - Feb 29 , 2024 | 07:55 AM

వరంగల్: మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం హనుమకొండ టీటీడీ కళ్యాణమండపంలో ప్రారంభం కానుంది. మొత్తం 512 హుండీల ఆదాయాన్ని లెక్కించనున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ పది రోజుల పాటు కొనసాగనుంది.

Medaram: మేడారం హుండీల లెక్కింపు నేడు..

వరంగల్: మేడారం (Medaram) హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం హనుమకొండ టీటీడీ కళ్యాణమండపంలో ప్రారంభం కానుంది. మొత్తం 512 హుండీల ఆదాయాన్ని లెక్కించనున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ పది రోజుల పాటు కొనసాగనుంది. మేడారం మహాజాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల క్రితం మేడారం నుంచి హుండీలను హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి అధికారులు తరలించిన విషయం తెలిసిందే. ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం జాతర శనివారం (24వ తేది) ముగిసింది.

Updated Date - Feb 29 , 2024 | 07:59 AM