శాసనమండలిలో ఖంగుతిన్న వైసీపీ సభ్యులు..

ABN, Publish Date - Jul 26 , 2024 | 10:01 AM

అమరావతి: ఏపీ శాసనమండలిలో వైసీపీకి మెజారిటీ ఉన్నా.. రెండు బిల్లులు ఆమోదం పొందడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. తాము లేని సమయంలో బిల్లులు ఆమోదించుకున్నారని, దీనిపై శాసనమండలి ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాలని వైసీపీ నతేలు భావించారు. అయితే శాసనమండలి సమావేశాలకు ఎవరూ రావద్దన్నారని అధికారపక్షం ప్రశ్నిస్తోంది.

అమరావతి: ఏపీ శాసనమండలిలో వైసీపీకి మెజారిటీ ఉన్నా.. రెండు బిల్లులు ఆమోదం పొందడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. తాము లేని సమయంలో బిల్లులు ఆమోదించుకున్నారని, దీనిపై శాసనమండలి ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాలని వైసీపీ నతేలు భావించారు. అయితే శాసనమండలి సమావేశాలకు ఎవరూ రావద్దన్నారని అధికారపక్షం ప్రశ్నిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, హెల్తో యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును పెడుతూ శాసనసభ ఆమోదించిన బిల్లు.. శాసనమండలి కూడా ఆమోదించింది. ఈ పరిణామంతో వైసీపీ ఖంగుతింది.


వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లులను శాసనమండలి ఆమోదించింది. ఈ రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆ బిల్లులను శాసన మండలిలో ప్రవేశపెట్టారు. పలువురు అధికార పార్టీ ఎమ్మెల్సీలు ల్యాండ్ టైట్లింగ్ బిల్లులోని లోపాలను ఎత్తిచూపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట వైఎస్సార్సీపీ సర్కార్ చేసిన చట్టం రాక్షస చట్టంగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు.


భూ దోపిడీల కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని వైసీపీ తెచ్చిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. అనేక లోపాలున్నాయని గతంలోనూ చట్టాన్ని వ్యతిరేకించినా గత జగన్ సర్కారు రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుని చట్టాలు చేసిందని విమర్శించారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించలేని ఇలాంటి బిల్లులను రద్దు చేయాల్సిన అవసరం ఉందనన్నారు. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టగా జగన్ ప్రభుత్వం తొలగించడాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. తిరిగి ఆయన పేరుపెట్టి మహనీయుడిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మూజువాణి ఓటుతో రెండు బిల్లులను మండలి చైర్మన్ మోషేను రాజు ఆమోదించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరంపై చంద్రబాబు కీలక నిర్ణయం..

కుప్పంలో చేరికలను వ్యతిరేకిస్తున్న టీడీపీ క్యాడర్‌

మా భూములు మాకు కావాలి.. తిరగబడ్డ జనం

యంగ్ స్టార్ కదా అని అవకాశమిస్తే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 26 , 2024 | 10:02 AM