ఆ తీర్పును స్వాగతించిన సీఎం చంద్రబాబు..
ABN, Publish Date - Oct 04 , 2024 | 10:11 PM
తిరుమల(Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని తెలిసిన వెంటనే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే(CM Chandrababu Naidu) ఈ అంశాన్ని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని తెలిసిన వెంటనే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే(CM Chandrababu Naidu) ఈ అంశాన్ని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రాజకీయపక్షాలతోపాటు హిందూ సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సిట్‌ను నియమించింది. దీనిపై టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్వతంత్ర కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. సత్యమేవ జయతే అంటూ పేర్కొన్నారు.
Updated at - Oct 04 , 2024 | 10:11 PM