భారీ వర్షం.. వాహనదారుల ఇక్కట్లు..
ABN, Publish Date - Oct 01 , 2024 | 09:53 PM
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సెక్రటేరియట్ పరిసత ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. అలాగే పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్ ర్పేట్, ఎస్ఆర్ నగర్, టోలిచౌకి, మెహదీపట్నం, షేక్ పేట్, అత్తాపూర్, లంగర్ హౌస్, మణికొండలో వర్షం దంచి కొట్టింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా సెక్రటేరియట్ పరిసత ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షపు నీటితో రోడ్లన్నీ కాలువలను తలపించగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లకు వేళ్లేందుకు నగరవాసులు నానావస్థలు పడుతున్నారు.
Updated at - Oct 01 , 2024 | 09:55 PM