తాను చెప్పే నీతులు జగ్గీ వాసుదేవ్ పాటిస్తారా..
ABN, Publish Date - Oct 04 , 2024 | 09:54 PM
జగ్గీ వాసుదేవ్(Jaggi Vasudev)కి వివాదాలు కొత్తేమీ కాదు. 1997లో ఆయన భార్య విజయకుమారి (Vijayakumari) మరణించారు. ఆమె మహాసమాధి చెందారని జగ్గీ వాసుదేవ్ చెప్పుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జగ్గీ వాసుదేవ్(Jaggi Vasudev)కి వివాదాలు కొత్తేమీ కాదు. 1997లో ఆయన భార్య విజయకుమారి (Vijayakumari) మరణించారు. ఆమె మహాసమాధి చెందారని జగ్గీ వాసుదేవ్ చెప్పుకున్నారు. విజయకుమారి మరణించిన వెంటనే ఆమె తండ్రి కూడా రాకముందే ఆయన దహన సంస్కారాలు చేశారు. మహాసమాధి అంటే ఖననం చేయాలి. కానీ జగ్గీ వాసుదేవ్ మాత్రం దహనం చేశారు. దీనిపై ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశ్రమంలో ఓ మహిళతో ఆయనకు సంబంధం ఉండేదని, అందువల్ల నిత్యం భార్యతో గొడవ పడేవారని భార్య తరఫు బంధువులు ఆయనపై ఆరోపణలు చేశారు. ఇప్పటికీ అది ఆ కేసు మిస్టరీగానే ఉంది. అప్పట్లోనే సద్గురుపై మర్డర్ కేసు నమోదు అయ్యింది.
Updated at - Oct 04 , 2024 | 09:54 PM