Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ABN, Publish Date - Jul 25 , 2024 | 10:37 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అనంతరం సభ పూర్వ సభ్యులైన పెండ్యాల వెంకట కృష్ణారావు, ఎన్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, సద్దపల్లి వెంకట రెడ్డిల మరణం పట్ల సంతాపం తెలియజేయునన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Meetings) నాల్గవ రోజు (4th Day) గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం (Question time) కొనసాగుతోంది. అనంతరం సభ పూర్వ సభ్యులైన పెండ్యాల వెంకట కృష్ణారావు, ఎర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, సద్దపల్లి వెంకట రెడ్డిల మరణం పట్ల సంతాపం తెలియజేయునన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 2018 -19 కి సంబంధించి 48వ వార్షిక నివేదికను హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) సభ ముందు ఉంచనున్నారు. తర్వాత రాష్ట్రంలో గత ఐదేళ్లలో శాంతిభద్రతల పరిస్థితిపై శ్వేత పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుదు సభ ముందు ఉంచనున్నారు. మరోవైపు ఏపీ శాసనమండలిలో ముందుగా ప్రశ్నోత్తరాలు సమయం కొనసాగుతోంది.


రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి, రౌడీయిజంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. ముందు గంజాయిని అరికట్టాలని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కోరారు. గంజాయి మత్తులో అనేక దారుణాలు జరుగుతున్నాయని, రౌడీయిజం, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తామని హోమ్ మంత్రి అనిత స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీసీటీవీ కెమెరాలు కూడా పని చేయలేదని, క్రిమినల్స్‌ను పట్టుకుంటే వారి పూర్వ చరిత్ర చూసుకునే సిస్టమ్ కూడా లేకుండా చేశారన్నారు. చివరకు గుడి, బడికి కూడా భద్రత లేదని, చివరకు గత ప్రభుత్వ హయాంలో నియంత్రణ లేక స్కూల్స్‌లో కూడా గంజాయి వచ్చిందన్నారు. గంజాయి నియంత్రణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయిందని, నియంత్రణకు ప్రణాళిక రూపొందిస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు.

Updated at - Jul 25 , 2024 | 10:37 AM