భూ సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ దోపిడి..

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:22 PM

గత ప్రభుత్వం భూముల రీ సర్వే పేరుతో ప్రజల ధనం దోచుకోడానికి పెద్ద కుట్ర పన్నిందని రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. ఈ రీ సర్వేను అడ్డుపెట్టుకోని జగన్ స్వంత వారికి లబ్ది చేకూర్చారని, ప్రచార యావతో ప్రజలను ఇబ్బందులు పెట్టారని మంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. గత ప్రభుత్వం (వైఎస్సార్‌సీపీ)లో జరిగిన భూముల రీ సర్వేపై చర్చలోభాగంగా రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. భూముల రీ సర్వే పేరుతో ప్రజల ధనం దోచుకోడానికి పెద్ద కుట్ర పన్నిందని ఆరోపించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ రీ సర్వే చేసేందుకు ప్రణాళికా బద్దంగా ఏర్పాట్లు చేసినట్లు జగన్ గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు.


ఈ రీ సర్వేను అడ్డుపెట్టుకోని జగన్ స్వంత వారికి లబ్ది చేకూర్చారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ విమర్శించారు. భూ సర్వే పేరుతో ప్రత్యర్దులను వేదించారని, ఓ పద్దతి ప్రకారం రీ సర్వే జరగలేదని మండిపడ్డారు. ప్రచార యావతో ప్రజలను ఇబ్బందులు పెట్టారని, భూ రీ సర్వే పేరుతో రూ. 9 వందల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. దీనిపై ఇప్పటి వరకు 6631 గ్రామ సభలు పెట్టామని, వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయన్నారు. అన్ని గ్రామ సభలు పూర్తి అయ్యాక ప్రణాళిక ప్రకారం ప్రజలకు న్యాయం చేస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన..

మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

సంక్షేమం..అభివృద్ధి .. ఏపీకి మహర్దశ

ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన మహాధర్నా వాయిదా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 21 , 2024 | 12:22 PM