అది వ్యవస్థలపై జరిగిన దాడి: కోటంరెడ్డి

ABN, Publish Date - Nov 20 , 2024 | 01:56 PM

స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఇచ్చిన వాంగ్మూలాన్ని గత వైఎస్సార్‌సీపీ హయాంలో జగన్‌ ఆదేశాలతో అధికారులు ఫ్యాబ్రికేట్ చేశారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ హోంమంత్రి అనితకు ఆయన లేఖ రాశారు.

అమరావతి: హోమంత్రి వంగలపూడి అనితకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు. చంద్రబాబుపై గత ప్రభుత్వంలో కుట్రలు చేశారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ డీజీపీకి రాసిన లేఖపై హోం మంత్రి స్పందించాలని కోరారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుపై పూర్తి స్థాయిలోవిచారణ జరపాలని కోరుతున్నట్లు తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని గుర్తు చేసుకున్నారు. రిటైర్డు ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్‌లో చెప్పారన్నారు. అది వ్యక్తిపై జరిగిన దాడి కాదని.. వ్యవస్థలపై జరిగిన దాడిగా అభివర్ణించారు.


గత ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం లేకుండా ఫైళ్లు మాయం కావని పీవీ రమేస్ డిబేట్‌లో చెప్పారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. పీవీ రమేష్ చెప్పిన అంశాలపై వెంటనే దర్యాప్తు చేయాలని హోంమంత్రికి బుధవారం కోటంరెడ్డి లేఖ రాశారు. ఆ లేఖతో పాటు ఏబీఎన్ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ వెంకటకృష్ణ , పీవీ రమేష్‌తో చేసిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్, ఆంధ్రజ్యోతి వార్తా కథనాన్ని శ్రీధర్ రెడ్డి జతచేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబధించిన ఫైళ్లు సీఎంవో, సీఐడీ, స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖలో ఫైళ్లు ఒకేసారి గల్లంతు అయ్యాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చెవులోపువ్వులుపెట్టుకున్నామా..: బొత్స

అదానీకి చెందిన హైడ్రో వద్ద ఆందోళన

‘నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి’

గంటన్నరపాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకున్న గుండె..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 20 , 2024 | 01:56 PM