ఆదోనిలో ఎమ్మెల్యేకు నిరసన సెగ

ABN, Publish Date - Nov 29 , 2024 | 01:10 PM

కర్నూలు జిల్లా: ఆదోనీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధికి సొంతపార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. స్థానిక ఎంఎం కాలనీలో ‘ప్రజల కోసం మీ పార్థసారధి’ కార్యక్రమానికి వెళ్లగా ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని బీజేపీ కార్యకర్తలు నిలదీశారు. వైఎస్సార్‌సీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లా: ఆదోనీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధికి సొంతపార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. స్థానిక ఎంఎం కాలనీలో ‘ప్రజల కోసం మీ పార్థసారధి’ కార్యక్రమానికి వెళ్లగా ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని బీజేపీ కార్యకర్తలు నిలదీశారు. వైఎస్సార్‌సీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేమీ లేదని అందరికీ న్యాయం చేస్తానని చెప్పి ఎమ్మెల్యే పార్థసారధి అక్కడి నుంచి వెళ్లిపోయారు.


నాగశైవ అనే బీజేపీ కార్యకర్త ఎమ్మెల్యే పార్థసారధి వద్దకు వచ్చి బీజేపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని.. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తనతో గొడవపడి, దాడి చేసి పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారని.. తాను కూడా కేసులు పెట్టానని చెప్పారు. ఇప్పుడు మళ్లీ రాజీ కావాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఒత్తిడా చేస్తున్నారని.. తనకు వాళ్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. తమకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వడంలేదని బీజేపీ కార్యకర్త ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లందరికి న్యాయం చేస్తామని చెబుతూ ఎమ్మెల్యే పార్థసారధి కార్యకర్తను ఓదార్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి 2. Oకు రంగం సిద్ధం

వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

కొమురం భీం జిల్లా లో టైగర్ టెర్రర్.. మహిళ మృతి..

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 29 , 2024 | 01:10 PM