ABN vs Sakshi: సాక్షి.. సిగ్గు.. సిగ్గు.. తప్పుచేసి, తోక ముడిచి
ABN, Publish Date - Oct 07 , 2024 | 07:43 PM
పోటీ ప్రపంచంలో తమ ప్రత్యర్థిని మించి ఎదగాలంటే అందుకు తగ్గట్లు ఆలోచనలు, వాటిని అమలు చేసే సామర్థ్యం, చాతుర్యం ఉండాలి. అలా కాకుండా.. ప్రత్యర్థిని కిందకు లాగేందుకు అక్రమానికి పాల్పడితే.. ప్రజలే వారికి చురకలు అంటిస్తారు. ఇప్పుడు సాక్షికి జరిగింది అదే.
హైదరాబాద్: పోటీ ప్రపంచంలో తమ ప్రత్యర్థిని మించి ఎదగాలంటే అందుకు తగ్గట్లు ఆలోచనలు, వాటిని అమలు చేసే సామర్థ్యం, చాతుర్యం ఉండాలి. అలా కాకుండా.. ప్రత్యర్థిని కిందకు లాగేందుకు అక్రమానికి పాల్పడితే.. ప్రజలే వారికి చురకలు అంటిస్తారు. ఇప్పుడు సాక్షికి జరిగింది అదే. అత్యధిక ప్రజాదరణ పొందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెబ్‌సైట్‌కు వచ్చే వీక్షకులను తమ వైపు తిప్పుకోవాలనే దురుద్దేశంతో కుట్రలకు తెర తీసింది సాక్షి. ఇందుకోసం గూగుల్‌లో అత్యధికంగా సర్చ్ చేసిన పదం 'andhrajyothy.com' ని సాక్షి సైట్ సాఫ్ట్‌వేర్‌లో ఎక్కించింది. వార్తల్లోనూ ఇదే బరితెగింపును కొనసాగించింది. ఈ విషయాన్ని కనుక్కున్న ఏబీఎన్ ఐటీ బృందం వరుస కథనాలను ప్రసారం చేసి సాక్షిని ప్రజల్లో నిలబెట్టింది. దీంతో సాక్షి మీడియా వెనక్కి తగ్గి నిశ్శబ్ధంగా ఆ ట్యాగ్‌ను తమ సైట్లో నుంచి తొలగించింది. విలువలకు తిలోదకాలివ్వడమే కాకుండా.. చేసిన తప్పుకు సాక్షి కనీసం క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం. ఇదే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ఇంఛార్జ్ సంజయ్, వెబ్ అనలిస్ట్ అమర్నాథ్ మాట్లాడారు. సాక్షి వికృత జర్నలిజాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు.
Updated at - Oct 07 , 2024 | 09:21 PM