Live: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.

ABN, Publish Date - Jul 25 , 2024 | 11:09 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశం అయింది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశం అయింది. రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెడతారు.


కాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎ కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు కేటాయించిన చాంబర్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. గతంలో కేటాయించిన చాంబర్‌ను ఉపయోగించాల్సిందేనని స్పష్టం చేశాయి. కేసీఆర్‌కు ఇరుకైన చాంబర్ కేటాయించారని, తమ నేతను అవమానపరిచే ఉద్దేశంతో ప్రభేత్వం వ్యవహరస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ బూమ్ బూమ్ రహస్యం...

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..

జగన్‌కు షాకిచ్చిన తిరుపతి కార్పొరేటర్లు..

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 25 , 2024 | 11:09 AM