సుప్రీం కోర్టు తీర్పుపై సుబ్బారెడ్డి ఏమన్నారంటే ..
ABN, Publish Date - Oct 04 , 2024 | 01:38 PM
తనపై వచ్చిన ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తన హయాంలో ఏ.ఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదన్నారు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారని, కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయన్నది కూడా తెలుస్తుందని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తీర్పుపై టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని, పొలిటికల్ కామెంట్ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ధర్మాసనం ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగిందని చెప్పారు.
తనపై వచ్చిన ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పామని సుబ్బారెడ్డి అన్నారు. తన హయాంలో ఏ.ఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదన్నారు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారని, కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయన్నది కూడా తెలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారని, వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్
తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కీలక నిర్ణయం
వివేకా కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం
బాల్కంపేట ఎల్లమ్మ తల్లి మహా లక్ష్మి అలంకరణలో..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 04 , 2024 | 01:38 PM