Share News

Leg health : ఇవి తింటే కాళ్లకు బలం...

ABN , Publish Date - Jan 09 , 2025 | 05:19 AM

మనం నిలబడాలన్నా, నడవాలన్నా, పరుగెత్తాలన్నా కాళ్లు బలంగా ఉండాలి. కొంతమందికి తరచూ కాళ్లలో తిమ్మిరి వస్తూ ఉంటుంది. పాదాల్లో సిరలు ఉబ్బి నొప్పిని కలిగిస్తుంటాయి. అలాకాకుండా కాళ్లలో కండరాలు పటిష్టంగా ఉండాలంటే బలవర్దకమైన ఆహారం తీసుకోవాలి.

Leg health : ఇవి తింటే కాళ్లకు బలం...

మనం నిలబడాలన్నా, నడవాలన్నా, పరుగెత్తాలన్నా కాళ్లు బలంగా ఉండాలి. కొంతమందికి తరచూ కాళ్లలో తిమ్మిరి వస్తూ ఉంటుంది. పాదాల్లో సిరలు ఉబ్బి నొప్పిని కలిగిస్తుంటాయి. అలాకాకుండా కాళ్లలో కండరాలు పటిష్టంగా ఉండాలంటే బలవర్దకమైన ఆహారం తీసుకోవాలి.

చికెన్‌ బ్రెస్ట్‌: ఇందులో ప్రోటీన్లు అధికం. చికెన్‌ బ్రెస్ట్‌ని గ్రిల్‌ లేదా బేక్‌ చేసి తీసుకున్నా, ఉడికించి సలాడ్‌లో కలుపుకుని తిన్నా ప్రయోజనం కనిపిస్తుంది. కూరగాయలతో కలిపి వండుకుని బ్రౌన్‌ రైస్‌తో తింటే శరీరానికి సమతులాహరం లభించి కాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

గ్రీక్‌ యోగర్ట్‌: ఇందులో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలం. ఇవి ఎముకలకు, కండరాలకు పుష్టినిస్తాయి. దీనిలోని ప్రోబయాటిక్స్‌ జీర్ణక్రియని వేగవంతం చేసి శరీరానికి పోషకాలు అందిస్తుంది. ఏదైనా స్మూతీలో కలుపుకుని తీసుకొటే కాళ్లకు బలం చేకూరుతుంది.

సోయా పన్నీర్‌: ఇది శాకాహారులకు వరం లాంటిది. మాంసంలో లభించే ప్రోటీన్లన్నీ ఇందులో ఉంటాయి. దీనిలో ఉండే తొమ్మిది రకాల అమినోయాసిడ్లు కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి. దీనిలోని మెగ్నీషియం.... కండరాల తిమ్మిరిని పోగొడుతుంది. సోయా పన్నీర్‌ని గ్రిల్‌ చేసి లేదంటే పాన్‌ మీద తేలికగా వేయించి తినడంవల్ల కాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

పాలకూర: ఇందులో ఐరన్‌, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని ఆక్సిజన్‌..... కండరాలకు చేరేలా చేస్తాయి. కాళ్లలో కండరాల తిమ్మిరిని తొలగించి పటుత్వాన్ని పెంచుతాయి. పాలకూరని సన్నగా తరిగి సలాడ్స్‌, స్మూతీల్లో కలుపుకుని తీసుకోవచ్చు. ఆలివ్‌ నూనె, వెల్లుల్లితో కలిపి కొద్దిగా వేయించి కూడా తినవచ్చు.

క్వినోవా, చియా గింజలు, బాదాం: వీటిలో కూడా అమైనోయాసిడ్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, పీచు పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కాళ్లలో కండరాలు బిగుసుకోకుండా చేస్తాయి. దీనివల్ల మోకాళ్లు, పాదాలలో నొప్పులు రాకుండా ఉంటాయి. రోజుకు అయిదు బాదాములను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తొక్కు తీసి తింటే మంచిది. చియా గింజలను ఓట్‌మీల్‌, స్మూతీల్లో కలుపుకుని తీసుకోవచ్చు. క్వినోవాను ఉడికించి సలాడ్స్‌, సూప్‌లలో కలుపుకోవచ్చు.

Updated Date - Jan 09 , 2025 | 05:19 AM