Home » Adilabad
యాసంగి సాగుకు రైతులు సమాయత్తమయ్యారు. అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో సాగు పనులకు శ్రీకారం చుట్టారు. వరి నాడు మడులు వేసుకొని నాట్లు వేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. శనగలు, మక్కలు, మినుములు విత్తుకుంటున్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యే విఫలమయ్యారని, ప్రజలను మోసం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఛార్జ్‌షీట్ విడుదల చేసి మాట్లాడారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యు) ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు.
సీఎం కప్ పోటీల్లో జిల్లాను ప్రథమ స్ధానంలో నిలపాలని జిల్లా యువజన క్రీడ అధికారి కీర్తి రాజ్‌వీరు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోటీలపై డీఈవో యాదయ్య, ఒలింపిక్ కార్యదర్శి రఘునాధ్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గత నెల 29 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొంది.
ధరణి సమ స్యల పరిష్కారం నానాటికీ జఠిలంగా మారుతోంది. భూ సమస్యలు పరిష్కరించాలని రైతులు రెవెన్యూ కార్యాల యాలకు, జిల్లా కేంద్రంలో కలెక్టర్ నిర్వహించే ప్రజావాణి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
వాతావరణ మార్పులతో అన్నదాతల్లో గుబులు నెలకొంది. తుఫాన్ ప్రభా వంతో జిల్లాలో రెండు రోజులుగా మబ్బులు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తు న్నాయి. వరి కోతలు ప్రారంభం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎయిడ్స్ కం ట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాలేజీ రోడ్డులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు ముఖ్య కూడళ్ల మీదుగా జీజీహెచ్ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు.
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ముల్కల్ల ఉన్న త పాఠశాలలో విద్యార్థులకు పునరుత్పాదక శక్తి వనరులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లా డుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలపై అవగా హన పెంచుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్ వెరబెల్లి అన్నారు. ఆదివారం మండల పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లా డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజా పాలన సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు.