Home » Anakapalli
సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.
రూ. 500 నోటు ఇచ్చి చిల్లర కావాలని అపరిచితులు కోరారు. దీంతో రూ.500 తీసుకుని వారికి చిల్లర ఇచ్చారు. అనంతరం ఐదు వందల కాగితం చూడాగా.. అని నకిలీదని గుర్తించారు. వెంటనే బాధితులను పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
Andhrapradesh: అనకాపల్లి జిల్లాలో సినీ పక్కిలో గంజాయి స్మగ్లర్లను పోలీసులు వెంబడించారు. స్మగ్లర్లు కారులో గంజాయిని తరలించేందుకు యత్నించారు. కారును చూసిన చెక్‌పోస్టు సిబ్బంది దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులకు చిక్కకుండా స్మగ్లర్లు చెక్ పోస్ట్‌ను కారుతో గుద్ది మరీ తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును చేజింగ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి రెడ్డి సత్యనారాయణ(99) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇవాళ(మంగళవారం) ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలోని తన స్వగ్రామం పెదగోగాడలో సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు.
సినీ, రాజకీయ రంగాల్లో తమ అభిమాన నటులు, నాయకులను కలుసుకోవాలని ఎంతోమంది ఆశిస్తారు. కానీ కొందరు మాత్రమే తమ ఆశలను నెరవేర్చుకోగలరు. నిజంగా తమ అభిమాన నేతను కలిస్తే.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. మన అభిమాన నాయకుడు సీఎం అయితే..
Andhrapradesh: ‘‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పరుగులు పెట్టిస్తాను. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి పారిశ్రామికవేత్త మిట్టల్ ముందుకు వచ్చారు. డ్వాక్రా సంఘాలు మా మానస పుత్రిక .. దీపం 2 కింద ఆడబిడ్డలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. నిన్న నేను టీ చేశాను.వంట చేయడం చాలా ఈజీ’’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తుని మీదుగా కేరళ రాష్ట్రానికి గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి వి.మాడుగుల, కొత్తకోట సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Andhrapradesh: వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారన్నారు. మద్యం తయారీ కంపెనీ నుంచి అమ్మకాలు వరకు అవినీతి చేసి అడ్డంగా దోచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన లిక్కర్ మాఫియాపై సీఐడీతో విచారణ జరిపిస్తున్నామన్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఒడిశాకు తాబేళ్లను అక్రమరవాణా చేస్తున్న ఇద్దరిని అటవీ శాఖాధికారులు అదుపులోకి తీసుకుని 500 తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.