Share News

Anakapalle: లంకెలపాలెంలో దొంగ నోట్ల కలకలం

ABN , Publish Date - Nov 19 , 2024 | 09:58 PM

రూ. 500 నోటు ఇచ్చి చిల్లర కావాలని అపరిచితులు కోరారు. దీంతో రూ.500 తీసుకుని వారికి చిల్లర ఇచ్చారు. అనంతరం ఐదు వందల కాగితం చూడాగా.. అని నకిలీదని గుర్తించారు. వెంటనే బాధితులను పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

Anakapalle: లంకెలపాలెంలో దొంగ నోట్ల కలకలం

అనకాపల్లి, నవంబర్ 19: జిల్లాలోని పరవాడ మండలం లంకెలపాలెంలో దొంగ నోట్ల కలకలం రేగింది. మంగళవారం ఉదయం ముమ్మడివరం నుంచి ఎన్‌ఏడీకి కొబ్బరిబొండాల లోడ్‌‌తో లారీ వచ్చింది. ఈ సందర్భంగా కొబ్బరి బొండాల వ్యాపారస్తులను రూ.500 కాగితం ఇచ్చి.. చిల్లర కావాలని ఆగంతకులు అడిగారు. వారికి చిల్లర ఇచ్చి.. ఆ ఐదు వందలు నోటు తీసుకున్నారు. ఇంతలో ఆ ఆగంతకులు వాహనంపై అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఆ తర్వాత రూ. 500 నోటుపై చిల్డ్రెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండడాన్ని వ్యాపారస్తులు విశాల్, అతడి మావయ్య శ్రీను గుర్తించారు. దీంతో ఖంగుతిన్న వారు.. వెంటనే పరవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

AP Govt: స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు తొలి సమావేశం.. కీలక నిర్ణయం

Also Read: ఉన్నతాధికారులు కీలక నిర్ణయం.. దుర్గమ్మ భక్తులకు సూచన

Also Read: శబరిమలకు వెళ్తున్నారా.. వాటితో జాగ్రత్త

Also Read: దబ్బ పండు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?


దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా లంకెలపాలెంలోని జేఎన్ఎన్‌యుఆర్ఎమ్ కాలనీలో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 6 నకిలీ 500 నోట్లు, 20 ఒరిజినల్ వంద రూపాయిలు నోట్లు స్వాదీనం చేసుకున్నారు. అనంతరం వారిని పరవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. దొంగ నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఈ సందర్భంగా పరవాడ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also Read: CM Chandrababu Naidu: రేపు మళ్లీ కేబినెట్ భేటీ

Also Read: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

Also Read: Maharashtra Elections: పోలింగ్ వేళ.. చిక్కుల్లో బీజేపీ

Also Read: KTR: రేవంత్ సర్కార్‌‌కి ప్రశ్నలు సంధించిన కేటీఆర్

For AndhraPradesh News And Telugu News..

Updated Date - Nov 19 , 2024 | 09:58 PM