Home » Arrest
బ్లేడు దాడి ఘటనలో 8 మందిని అరెస్ట్(Arrest) చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితులకు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఇందుకు సంభంధించి బోయిన్పల్లి డీఐ సర్దార్ నాయక్, ఎస్ఐ శివశంకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
వాల్తేరు రైల్వే డివిజన్లో ఆదివారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ముంబైలో సీబీఐ అధికారులకు చిక్కారనే వార్త డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు నగర వాసుల్లోనూ సంచలనం కలిగింది. డివిజన్ చరిత్రలో డీఆర్ఎం స్థాయి అధికారి సీబీఐకి పట్టుబడడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ చేసిన న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో సురేష్ రెడ్డిని నరసరావుపేట జైలుకు తరలించారు.
రాజస్థాన్‌లో డియోలీ-ఉనియారాతోపాటు ఏడు నియోజకవర్గాలకు బుధవారం ఉపఎన్నిక జరిగింది. డియోలి-ఉనియారా నియోజకవర్గం తరఫున నరేశ్ మీనా అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు.
కర్నూలు జిల్లా, కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అరెస్టు చేశారు.
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ డిటిసి సెంటర్‌కు తరలించారు. డిటిసి సెంటర్‌కు వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కెటీఎఫ్ చీఫ్ హర్దీప్ నిజ్జర్ గత ఏడాది కెనడాలో హత్యకు గురికావడం, ఈ ఘటనలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్‌కు సన్నిహితుడైన డల్లాకు భారతదేశంలో పలు క్రిమినల్ కేసులతో సంబంధాలు ఉన్నాయని ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లా, కదిరి మున్సిపాల్టీ పరిధిలోని సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని షామీర్ భాషా కబ్జా చేశాడంటూ మున్సిపల్ కమిషనర్ గత నెల 13న ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షామీర్ భాషాతోపాటు ఆర్ఐ మున్వర్ భాషా ఇతర వైసీపీ నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగువారిని కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి(Kasturi)ని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అదే సమయంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఆమె తాజాగా తన ఎక్స్ పేజీలో ప్రకటించారు.
కలుషిత మోమోస్ తిన్న కారణంగా రేష్మ బేగం అనే గృహిని మృతి చెందిన కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ చింతల్ బస్తీలో మెమోస్ తయారు చేస్తున్న అల్మాస్‌ను అరెస్టు చేశారు. బీహార్ నుంచి వచ్చిన ఆతను.. చింతల బస్తీలో మెమోస్ తయారు చేస్తున్నాడు.