Home » Botcha Sathyanarayana
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. హామీల విషయంలో కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని తాము పెద్దగా ఈ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని అన్నారు. కూటమి పెద్దలు ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత .2026లో ఎన్నికలు వస్తున్నాయని చెప్పారని గుర్తుచేశారు.
కూటమి పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలమా లేక వ్యతిరేకమా? చెప్పాలంటూ మాజీ మంత్రి బొత్స ప్రశ్నించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని, ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి దాన్ని సంపాదించుకున్నట్లు బొత్స చెప్పుకొచ్చారు.
కలుషిత ఆహారం తిని, పిల్లలు, అస్వస్థతకు గురవుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రెండు నెలల్లో పది ఘటనలు జరిగాయని గుర్తుచేశారు.ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు.
అధికారం శాశ్వతం కాదు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయ్’ అంటూ వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన ట్వీట్‌పై టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinivasa Rao) మండిపడ్డారు. టీడీపీ నాయకులు ప్రైవేటు ఆస్తులైన వైసీపీ కార్యాలయాల్లోకి వెళ్లి సందర్శించడం సరికాదన్న బొత్స మాటలపై ఆయన ధ్వజమెత్తారు.
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన ప్రశ్నించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులైందని..
గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు ఉపాధ్యాయుల బదిలీల పేరిట భారీ అవినీతి జరిగిందని బాధితులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) తాము 175 స్థానాల్లో గెలుస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లాలో మరోసారి తొమ్మిదికి తొమ్మిది గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) తప్పకుండా అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9న జగన్ సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వేదిక ఎక్కడో రెండు రోజుల్లో చెబుతానని అన్నారు. కేంద్రంలో తమ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటానని... ఇది తన స్వార్థమని తెలిపారు.