Home » CM Revanth Convoy
రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఈటెల ఫైరయ్యారు. మోదీని విమర్శించేంత స్థాయి రేవంత్ కు లేదన్నారు.
భద్రకాళి అమ్మవారిని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని మాటిచ్చారు. భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలయశంగా మారుస్తామని హామీ ఇచ్చారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం డిజిటల్ కార్డుల సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి కుటుంబాల హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 7న పైలట్ ప్రాజెక్ట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రికార్డు ప్రక్రియ పూర్తి కానుంది.
సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కాన్వాయ్ వెళ్లే దారిలో డమ్మీ బాంబు కలకలం రేపింది. ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ప్రయాణించే జూబ్లీహిల్స్ దారిలో నలుపు రంగు బ్యాగు లభించింది.
రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరు (ఎల్లుండి)లోగా రైతులకు రూ.1.50 లక్షల రుణాలను మాఫీ చేసి, తమ నిబద్ధతను చాటుకుంటామని తెలిపారు.
Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబరులో జరగనున్నాయా!? ఇందుకు నవంబరులో నోటిఫికేషన్ విడుదల కానుందా!? ఈ ప్రశ్నలన్నిటికీ ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు.
చదువు కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా గిరిజన ఆడబిడ్డకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఐఐటీలో చేరేందుకు ఆ విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసింది.
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్ నేవీ రాడార్ (వేరి లో ఫ్రీక్వెన్సీ-వీఎల్ఎఫ్) ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నారు.
తెలంగాణ భవన్‌ను ఢిల్లీలోనే ఒక ఐకానిక్ టవర్గా నిర్మించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తాను మంత్రి పదవిని చేపట్టిన మూడో రోజే తెలంగాణ భవన్ నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన బీఆర్‌ఎ్‌సకు.. శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె స్లో చేరారు.