Home » Dera baba
దైవ దూషణకు పాల్పడ్డారంటూ డేరా సచ్ఛా సౌధా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్‌పై నమోదైన కేసుల విచారణపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
డేరాబాబాపై 2015లో గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలపై నమోదైన కేసుపై పంజాబ్- హర్యానా హైకోర్టు ఇచ్చిన స్టేను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు తొలగించింది.
శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ మరోసారి పెరోల్‌పై విడుదల కానున్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ డేరాబాబా పెరోల్‌పై బయటకు రానున్నారు. పెరోల్ కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని భారత ఎన్నికల కమిషన్ ఆమోదించింది.
డేరా మాజీ అధికారి హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ను(Gurmeet Ram Rahim Singh) పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు 2002లో హత్య చేశారు.
ఆశ్రమంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా(Dera Baba) అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్(Ram Rahim Singh)కు మళ్లీ పెరోల్ మంజూరైంది. హరియాణాలోని రోహ్తక్ సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న అతనికి 50 రోజులపాటు పెరోల్ మంజూరు చేస్తు అక్కడి కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అతని తల్లి అనారోగ్యం కారణంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
వివాదాస్పద గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానా ప్రభుత్వం 21 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన రెండు హత్యాకేసుల్లో యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత 21 నెలల్లో ఆయన జైలు నుంచి పెరోల్‌పై విడుదల కావడం ఇది ఆరవసారి.
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరాబాబాకు పెరోల్ ఇవ్వడాన్ని హర్యానా..
నలభై రోజుల పెరోల్‌పై గత శనివారంనాడు హర్యానాలోని రోహ్టక్ జిల్లా సునరియా జైలు నుంచి విడుదలైన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ బాబా మరోసారి వార్తల్లోకి..