డేరా బాబా కేసులపై స్టే తొలగింపు
ABN , Publish Date - Oct 19 , 2024 | 03:52 AM
దైవ దూషణకు పాల్పడ్డారంటూ డేరా సచ్ఛా సౌధా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్‌పై నమోదైన కేసుల విచారణపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 18: దైవ దూషణకు పాల్పడ్డారంటూ డేరా సచ్ఛా సౌధా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్‌పై నమోదైన కేసుల విచారణపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గురుగ్రంథ్ సాహిబ్‌ను అవమానపరచడంతో పాటు, దైవదూషణకు పాల్పడ్డారంటూ ఆయనపై 2015లో మూడు కేసులు నమోదయ్యాయి. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా పంజాబ్‌లోని ఫరీద్కోట్, బెహబాల్ కలాన్ల్లో జరిగిన ప్రదర్శనలు హింసకు దారి తీయడంతో ఇద్దరు మరణించారు కూడా. ఈ కేసుల విచారణ జరగకుండా ఈ ఏడాది మార్చి నెలలో పంజాబ్-హరియాణా హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిని ఎత్తివేయాలని కోరుతూ పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.