Home » Dhaka
భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తీసుకు వచ్చేందుకు మధ్యంతర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇస్కాన్ సంస్థను నిషేధించాలని చిట్టగాంగ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెఫాజత్ ఎ ఇస్లాం పిలుపునివ్వడంతో వివాదం నెలకొంది.
ప్రముఖ హిందూ సాధువు, ఇస్కాన్ గురువు చిన్మయ కృష్ణపై బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది.
రాజకీయ సంక్షోభంతో అధికారం చేతులు మారిన బంగ్లాదేశ్‌లో.. హిందువులు గళమెత్తారు. షేక్ హసీనా ప్రభుత్వం అనంతరం తొలిసారి భారీ ర్యాలీ నిర్వహించారు.
బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి మైనార్టీలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి.
హసీనా రాజీనామా తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. తాజాగా.. భారత సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్) చేపట్టిన పశువుల కంచెల నిర్మాణాన్ని బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్(బీజీబీ) అడ్డుకుంది.
ప్రముఖ బంగ్లాదేశ్ క్రికెట్ క్రీడాకారుడు, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదయింది.
బంగ్లాదేశ్‌లో హిందువులతో సహా మైనారిటీలపై దాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆదేశ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముహమ్మద్ యూనుస్ ఢాకాలోని ప్రఖ్యాత ఢాకేశ్వరి హిందూ దేవాలయాన్ని మంగళవారంనాడు సందర్శించారు. హిందూ పెద్దలను కలుసుకున్నారు.
బంగాళాఖాతంలో అదొక అందాల పగడపు దీవి.. మొత్తం విస్తీర్ణం మూడు చదరపు కిలోమీటర్లే.. కానీ, ఎంతో వైవిధ్యం.. అంతకుమించిన ప్రకృతి సౌందర్యం.. ప్రత్యేకించి సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం..! దీంతో అమెరికా కన్నుపడింది..
బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.