Home » Dwaraka Tirumala
జిల్లా వాసులను కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. రాజమహేంద్రవరం, ద్వారకా తిరుమల ప్రాంతాల మధ్య తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.
ఏలూరులోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామి వారి రథోత్సవం జరగనుంది.
చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 వ రోజు గురువారం చిన వెంకన్న మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. అలాగే రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదివారం రాత్రి సందర్శించారు.
ఏలూరు జిల్లా కామవరపుకోటలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో (Sri Venkateswara Junior College) అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. గత 40 సంవత్సరాలుగా ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కాలేజ్ నడుస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కాలేజీని పట్టించుకోక పోవడంతో విద్యార్థులు తగ్గిపోయారు.
ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు బుధవారం చిన వెంకన్న స్వామి మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం స్వామివారు రామ లక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం స్వామివారు కాళీయమర్ధన ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ద్వారకా తిరుమలలో వైసీపీ నాయకులతో కలిసి అధికారుల బరితెగింపు రోజురోజుకూ ఎక్కువవుతోంది. వలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారు. వలంటీర్లను.. వైసీపీ నాయకులను కలవమని ఎమ్మెల్వో అధికారి చెబుతున్నారు. వలంటీర్లందరూ రిజైన్ చేయాలని వాట్సాప్ గ్రూప్లో వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు.
మీరు మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని(tour) ఆలోచిస్తున్నారా. అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ రైల్వే ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. వాటిలో భాగంగా సుందర్ సౌరష్ట(sundar saurashtra) కూడా ఒక బెస్ట్ ప్యాకేజీ అని చెప్పవచ్చు. అయితే ఈ టూర్ వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏయే ప్రాంతాలు కవర్ చేస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.