Home » Fire Accident
తిరుమలలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
అనేక మంది పిల్లలు ఉన్న మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు మరణించారు. ఈ విషాధ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలో చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఇంజన్ నుంచి రెండో బోగీలో అకస్మాత్తుగా మంటలు వచ్చినట్టు తెలిసింది. దీంతో 45 నిమిషాల పాటు బరూచ్ సిల్వర్ బ్రిడ్జి సమీపంలో రైలును ఆపేశారు. వెంటనే ప్రయాణికులు రైలు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పెద్ద ఎత్తున పేలుడు, మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల కంపెనీలు, ప్రజలు భయందోళనలకు గురయ్యారు. మంటలు ఎగసిపడటంతో వెంటనే రిఫైనరీలోని కార్మికులను సురక్షింతంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని రంజోల్ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్ నుంచి జహీరాబాద్ మీదుగా హైదరాబాద్‌కు కంటైనర్‌లో 8 టాటా నెక్సాన్ కార్లను తరలిస్తుండగా షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి.
హైదరాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు వన్‌లో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
హైదరాబాద్ రాం నగర్ చౌరస్తా సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు.
కాకినాడ రూరల్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రూరల్ మండలం కొవ్వాడలో మంగళవారం అర్ధరాత్రి శ్రీనిలయం డోర్ నెంబర్ 1-79 ఇంటి భవనంలో ఒక్కసారిగా మంటలు ఉవె త్తున ఎగిసిపడ్డాయి. ఇంటి యజమాని భార్య తో కలిసి కొన్ని రోజుల క్రితం అమెరికాలోని కుమారుడి వద్దకు వెళ్లారు. దీంతో స్థానికులు సాలిపే
హైదరాబాద్: భాగ్యనగరంలోని మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. కొంత మేర ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనల ప్రదేశాలకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉషారాణి, మోహన్ లాల్ దంపతులు గత కొంత కాలంగా బాణాసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్బంగా ముందుగానే టాపాసులు తీసుకువచ్చి ఇంట్లో నిలువ ఉంచుకున్నారు. రాత్రి ఇంట్లో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిరి టపాసుల్లో పడడంతో మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు పెరిగి ఇంట్లో ఉన్న బాణా సంచా మొత్తం పేలిపోయింది.