Share News

Hyderabad: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Nov 07 , 2024 | 08:58 PM

హైదరాబాద్‌ రాం నగర్ చౌరస్తా సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు.

Hyderabad: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్, నవంబర్ 07: చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని అజమాబాద్ సమీపంలో రాంనగర్ చౌరస్తా వద్ద ఓ బట్టల దుకాణంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బట్టల దుకాణం మూసి ఉంది. దాంతో దుకాణం షట్టర్ తెరిచేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితోపాటు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.


fire1.jpgఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దుకాణం యజమాని షాపు మూసి వెళ్లిన కొంత సేపటికే ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులకు స్థానికులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు దుకాణం మూసి ఉండగా.. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించ లేదని పోలీసులు చెప్పారు. ఇంకోవైపు రాంనగర్ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

sbi.jpg

Also Read:YS Sharmila: సైకోలను ఇరగదీయండి

Also Read: పుట్టగొడుగులు తినడం వల్ల ఇన్ని లాభాలా..?

Also Read: రోజమ్మ నీకో న్యాయం..మాకో న్యాయమా ..!

Also Read: రేవంత్ ఉడుత ఊపులకు అదర బెదర

Also Read: వైసీపీ సైకోలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

Also Read: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

Also Read: Teenmar Mallanna: ఎన్నికల్లో చిచ్చు పెట్టేందుకే..

For Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 09:07 PM