Home » Gautham Adani
గౌతమ్ అదానీకి ప్రధాని మోదీ రక్షణ కవచంగా నిలిచారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అదానీ అవినీతి గురించి అమెరికాలో కేసు నమోదైందని గుర్తుచేశారు. భారతదేశంలో కేసు నమోదు కాదని.. ఎందుకంటే అదానీ వెనక మోదీ ఉన్నారని ఆరోపణలు చేశారు.
అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ సంపద రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీని దాటేసింది. ‘హురున్ ఇండియా -2024’ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం రూ.11.6 లక్షల కోట్లతో తొలి స్థానంలో నిలిచారు. 2020 సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ నాలుగవ స్థానంలో నిలిచారు.
Gautam Adani Love Story: ప్రేమలో పడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. యుక్త వయసులో చాలా మంది ప్రేమలో మునిగిపోతారు. సమయం కూడా తెలియనంతగా ప్రేయసి, ప్రియుడితో కబుర్లలో తేలిపోతారు. ఆ ప్రేమ ఫలించి వివాహ బంధంతో ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉంటే అంతకంటే సంతోషం ఆ ప్రేమ జంటకు మరోటి ఉండదు. అయితే, నేటి కాలంలో ప్రేమలో పడిన యువతీ యువకులు పెళ్లితో ఒక్కటైన దాఖలాలు చాలా తక్కువే అని చెప్పాలి.
కోట్లాది రామ భక్తుల కళ సోమవారంతో నెరవేరింది. శ్రీరామచంద్రుడు తన జన్మస్థలమైన అయోధ్యలో కొలువుదీరాడు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యర్యంలో జరిగిన ఈ వేడుకకు 7 వేల మందికిపైగా అతిథులను ఆహ్వానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదానీ దోచిన డబ్బులు ప్రధాని మోదీ, బీజేపీకి వెళతాయని రేవంత్ రెడ్డి అన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు దావోస్లో అదానీతో సీఎం రేవంత్ రెడ్డి అలయ్ బలయ్ తీసుకుంటున్నారని విమర్శించారు.
ప్రధాని మోదీ(PM Modi) స్వరాష్ట్రం గుజరాత్ కు పెట్టుబడులు వరద కొనసాగుతోంది. టాప్ బిలీయనీర్ అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) తన భారీ పెట్టుబడి ప్రణాళికను బుధవారం వివరించారు. ఆయన కంపెనీలు గుజరాత్లో 2025వరకు రూ.55 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో ఈ ఆర్థిక సంవత్సరం కూడా భారీ పెట్టుబడులు పెడతామని అదానీ (Adani) సంస్థ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని వివరించింది. దీంతో లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని పేర్కొంది.
కొన్నిరోజులుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో అదానీ గ్రూప్ షేర్లు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచ కుబేరుల్లో మూడు రోజుల కిందట 20వ స్థానంలో ఉన్న అదానీ ప్రస్తుతం 82.5 బిలియన్ డాలర్ల సంపదతో 15వ స్థానంలో ఉన్నారు.
ప్రతిపక్ష ఇండియా(INDIA Alliance) కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మహారాష్ట్ర(Maharashtra)కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధినేత శరద్ పవార్(కూటమి సభ్యుడు) ఇటీవల గుజరాత్ లో అదానీని కలవడంపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య పోస్టర్ల వార్ ముదురుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పది తలల రావణుడితో పోలుస్తూ బీజేపీ తన ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ పెట్టగా.. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ లీడర్లు సైతం పలు పోస్టులు చేశారు. తాజాగా ఆ పార్టీ మరో పోస్ట్ మరింత వివాదాస్పదం అవుతోంది.