Gautam Adani: అదానీని అరెస్ట్ చేయాల్సిందే: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:28 PM
గౌతమ్ అదానీకి ప్రధాని మోదీ రక్షణ కవచంగా నిలిచారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అదానీ అవినీతి గురించి అమెరికాలో కేసు నమోదైందని గుర్తుచేశారు. భారతదేశంలో కేసు నమోదు కాదని.. ఎందుకంటే అదానీ వెనక మోదీ ఉన్నారని ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టులు అదానీకే ఏ విధంగా దక్కుతాయని ఆయన ప్రశ్నించారు. ‘సెకీ ఒప్పందాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టాలి. అదానీని అరెస్ట్ చేసి విచారిస్తే సెకీ అక్రమాలు వెలుగులోకి వస్తాయి. అదానీని అరెస్ట్ చేసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా..?
అదానీ అరెస్ట్ అయితే ప్రధాని మోదీ అక్రమాలు బయటపడతాయి. అందుకే అదానీని మోదీ అరెస్ట్ చేయరు. అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే. అదానీ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతిపై అమెరికా కోర్టులో కేసులు కూడా పెట్టారు. దేశంలో మాత్రం ఏ కేసు లేవు అని’ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
అండగా మోదీ
‘గౌతమ్ అదానీ వెనక ప్రధాని మోదీ ఉన్నారు. అదానీని మోదీ కాపాడుతున్నారు. చిన్న చిన్న దొంగతనాలు చేసే వారిపై మాత్రం కేసులు పెట్టి జైలుకు పంపుతారు. అదానీపై కేసులు పెట్టరు.
అదానీ విద్యుత్ అవినీతిపై పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతాం. అదానీని అరెస్ట్ చేయరు. ప్రధాని మోదీ ఆయనకు రక్షణ కవచంగా నిలబడ్డారు అని’ రాహుల్ గాంధీ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి:
Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. కారణమిదే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News