Home » Rahul Gandhi
హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తప్పకుండా గెలుస్తామనుకున్న కాంగ్రెస్ కూటమికి భంగపాటు తప్పలేదు. మహారాష్ట్రలో ఇండియా కూటమిలోని ఏ భాగస్వామ్య పక్షానికి ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు దక్కలేదు. దీంతో పార్టీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థంకాని పరిస్థితి నెలకొంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో..
రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి పెరిగిందని, గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే, ఆలుగడ్డలు, ఉల్లి ధరలు 50 శాతం పెరిగాయని, రూపాయి విలువ 84.50కు పడిపోయిందని రాహుల్ అన్నారు. నిరుద్యోగం ఇప్పటికే 45 సంవత్సరాల కంటే అధిక నిరుద్యోగిత స్థాయిని నమోదు చేసిందని చెప్పారు.
దేశంలో విద్వేషాలు, విభజనకు బీజేపీ ఆజ్యం పోస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.
పార్టీలో కష్టపడిన నాయకులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కింద స్థాయి కేడర్ కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం కష్టపడిన వారిని కీలక పదవుల్లో నియమిస్తామని ఆయన తెలిపారు.
దేశంలో ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలకు, ప్రశ్నార్థకంగా మారిన ఎన్నికల కమిషన్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది.
నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పార్టీకి ఒక సవాలని శుక్రవారంనాడిక్కడ జరిగిన సీడీబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
బీజేపీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం రచించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని వైఎస్ షర్మిల తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న కులగణన ప్రక్రియ.. ప్రజా ప్రక్రియ అని లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రం అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తామన్నారు. అందరికి సమాన హక్కు కోసం తాను పోరాడుతున్నట్లు తెలిపారు.
సంభాల్ కాల్పుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత తొందరపాటు వైఖరి అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనికి బీజేపీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హిందూ-ముస్లిం సమాజాల మధ్య చీలికలు, వివక్షను సృష్టించేందుకు బీజేపీ అధికారాన్ని ఉపయోగించుకోవడం రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలిగించదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏఐసీసీ పెద్దలను ఆయన కలవనున్నారు.