Home » God
కార్తీకమాసం ఆరుద్ర నక్ష త్రాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం శారదానగర్‌లోని శివబాల యోగి ఆశ్రమంలో కోటి దీపో త్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం అనంతేశ్వరస్వామికి భక్తుల చేతులమీదుగా అన్నాభిషేకం చేశారు.
భారతీయ సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబిం బాలు ఆలయాలు అని అవని శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీ అద్వైతానంద భారతి అన్నారు. శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠం, మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వరాలయం, పాతూరులోని దత్తమందిరాలను మంగళవారం ఆయన సందర్శించారు.
మండలపరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తు లు స్వామివారి దర్శనం కోసం తరలివ చ్చారు.
మండలంలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి రూ.రెండు లక్షలకు పైగా విలువైన బంగారం పులిగోరు హారాన్ని భక్తు లు మంగళవారం సమర్పించారు.
లోకరక్షణకోసం శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరిని చిటికినవేలితో ఎత్తిన పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నగర శివా రులోని ఇస్కాన మంది రంలో గోవర్ధనరిపూజను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నకూటమితో గోవర్ధనిగిరిని ఏర్పాటుచేసి, రకరకాల పండ్లు, కూరగాయలతో గిరిని అలంకరించి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
శారదా నగర్‌లోని శివబాలయోగి ఆశ్రమంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు నదీజలాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి, ఆలయ ఆవరణలో కలశపూజలు నిర్వహించారు.
లోకకల్యాణం కోసం శా రదానగర్లోని శివబాల యోగి ఆశ్రమంలో గురు వారం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులతో ఆలయ ప్రాకా రోత్సవం నిర్వహించారు. అనంతరం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు.
మండల పరిధిలోని హనకనహాళ్ రామాలయ ఉత్సవ రథానికి దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలింటి ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు రూ.19 లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం రథాన్ని తయారు చేయించి పురాతన రామాలయానికి సమర్పించారు. రథాన్ని భద్రపరిచేందుకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో రథాన్ని గ్రామంలో ఊరేగించి, యథాస్థానంలో..
సాయి ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని శ్రీ7 కన్వెన్షన హాల్లో శనివారం శ్రీవారి సేవలో ఒకరోజు పేరుతో వెంకటేశ్వర వైభవం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవంతో పాటు వివిధ సేవలను నిర్వహించారు. ఈనేపథ్యంలో శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం స్నపన తిరుమంజనం, అష్టదళ పద్మార్చన, తోమాల సేవ, పుష్పయాగం, తిరుప్పాడ సేవ, ఏడుశనివారాల వ్రతం, హనుమంత వాహన సేవ, నిర్వహించారు.
అనంతపురం నగరంలో ఐదురోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. అంతకు మునుపు మండపాల వద్ద పెద్దఎత్తున అన్నదానం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సప్తగిరి సర్కిల్లోని వినాయక్ చౌక్ వరకూ శోభాయాత్రలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి దారిపొడవునా భక్తులు బారులు తీరారు. ఆకట్టుకునే వేషధారణలతో రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా వేడుకలలో పాల్గొంది. వినాయక్ ...