Home » Gyanvapi case
జ్ఞానవాపి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన గోపురం (సెంట్రల్ డోమ్) కింద తవ్వకాలు చేపట్టాలని, భారత పురావస్తు శాఖతో (ASI) అదనపు సర్వే చేయించాలంటూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ను వారణసీ కోర్టు ఇవాళ (శుక్రవారం) తోసిపుచ్చింది.
జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.
జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసేందుకు వారణాసి సెషన్స్ జడ్జి ఇటీవల అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ రోజు అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ జ్ఞానవాపిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న ‘వ్యాస్ కా టెఖానా’లో మంగళవారం నాడు పూజ చేశారు.
జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఈ మసీదు కింద ఆలయ శిథిలాలు ఉన్నాయని పురావస్తు శాఖ సర్వే ఆధారంగా.. సెల్లార్లో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని కోర్టు ఇచ్చిన అనుమతిపై ముస్లిం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జ్ఞానవాపి దక్షిణ సెల్లార్లో హిందువుల ప్రార్ధనలకు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై 'స్టే' ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు (Allahabad High court) శుక్రవారంనాడు నిరాకరించింది. దీంతో జిల్లా కోర్టు ఆదేశాలను సవాలు చేసిన అంజుమన్ ఇంతేజామియా మాసాజిద్కు ఎదురుదెబ్బ తగిలింది.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే విడుదల చేసిన ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వివాదాస్పదమైన జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సంచలన నివేదిక ఇచ్చింది. మసీదు కన్నా ముందు ఇక్కడ హిందూ దేవాలయం ఉందని పురావస్తు శాఖ తెలిపింది. హిందూ ఆలయాన్ని కూల్చేసి, ఈ మసీదుని నిర్మించారని ఈ నివేదిక పేర్కొంది.
జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికపై వారణాసి జిల్లా కోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. సర్వే నివేదిక హార్డ్ కాపీని పిటిషనర్లు, కేసు సంబంధీకులకు అందజేయాలని పేర్కొంది. అయితే నివేదక ప్రతిని మాత్రం తర్వాత బహిరంగం చేస్తారు.
జ్ఞానవాపి మసీదులోని 'వాజూఖానా' ప్రాంతాన్ని పరిశుభ్రం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. వాజూఖానా ప్రాంతంలో శివలింగం కనిపించడం, ఆ ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉండటంతో దానిని క్లీన్ చేసేందుకు అనుమతించాలంటూ హిందూ మహిళా పిటిషన్లరు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.