Share News

Gyanvapi case: జ్ఞానవాపి కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Oct 25 , 2024 | 09:09 PM

జ్ఞానవాపి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన గోపురం (సెంట్రల్ డోమ్) కింద తవ్వకాలు చేపట్టాలని, భారత పురావస్తు శాఖతో (ASI) అదనపు సర్వే చేయించాలంటూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను వారణసీ కోర్టు ఇవాళ (శుక్రవారం) తోసిపుచ్చింది.

Gyanvapi case: జ్ఞానవాపి కేసులో కీలక పరిణామం
Gyanvapi case

వారణసీ: జ్ఞానవాపి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన గోపురం (సెంట్రల్ డోమ్) కింద తవ్వకాలు చేపట్టాలని, భారత పురావస్తు శాఖతో (ASI) అదనపు సర్వే చేయించాలంటూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను వారణసీ కోర్టు ఇవాళ (శుక్రవారం) తోసిపుచ్చింది. ఈ పరిణామంపై హిందూ పక్షం తరపు న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగి మాట్లాడారు. ‘‘కోర్టు నిర్ణయం నిబంధనలకు, వాస్తవాలకు విరుద్ధం ఉంది. ఈ పరిణామం నిరుత్సాహం కలిగించింది. ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి సవాలు చేస్తాం. ఏప్రిల్ 8, 2021 నాటి ఆర్డర్ ప్రకారం.. సర్వే చేపట్టేందుకు ఏఎస్ఐకి 5 మంది సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ఒకర్ని నియమించాలి. సభ్యులంతా కలిసి ఏఎస్ఐ సర్వే చేపట్టాల్పి ఉంది. కానీ గతంలో జరిగిన సర్వే ఇందుకు అనుగుణంగా జరగలేదు. ఏప్రిల్ 8, 2021 ఆర్డర్ ప్రకారం సర్వే జరగలేదని హైకోర్టు నిర్ధారించింది. కాబట్టి మేము హైకోర్టును ఆశ్రయిస్తాం’’ అని న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగి చెప్పారు.


కాగా లార్డ్ విశేశ్వర వర్సెస్ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ కేసు విచారణ 1991 నుంచి కొనసాగుతోంది. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు చేసేందుకు, ఆలయాన్ని నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ పక్షం కోర్టును కోరింది. ముస్లింల తరఫు వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి అనేక పూర్వాపరాలకు చెందిన కాపీలను హిందూపక్షం కోర్టు ముందుంచడంతో అంజుమన్ ఇంతేజామియా కమిటీ, వక్ఫ్ బోర్డు తరపున ఇద్దరు ముస్లిం న్యాయవాదులు వాదనలు వినిపించారు.

Updated Date - Oct 25 , 2024 | 09:10 PM