Home » Hemanth Soren
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వయసు వివాదాంశం అయింది. ఐదేళ్లలో ఏడేళ్లు పెరిగాడంటూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జార్ఖండ్‌లో ఈసారి బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉందంటూ ఎన్నికల షెడ్యూల్ ముందువరకు ప్రచారం జరిగింది. ఇప్పటికీ తాము గెలుస్తామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి జేఎంఎంతో కలిసి పోటీ చేస్తుండగా.. తాము వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. విజయంపై రెండు కూటములు..
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత చంపై సోరెన్ తన X ప్రొఫైల్ నుంచి జేఎంఎం పేరును తొలగించారు. దీంతో చంపై సోరెన్ బీజేపీలోకి వెళ్లబోతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
భూముల కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి జార్ఖండ్ సీఎం సొరేన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు జూన్ 28న ఇచ్చిన బెయిల్ హేతుబద్ధమైందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. ఈ సందర్బంగా హేమంత్ సోరెన్‌కు జార్ఖ్ండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులోని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం సమర్థించింది.
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సోమవారం ప్రఽధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలను హేమంత్ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోతుందని ఝార్ఖండ్ ముక్తి మోర్చ నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ జోస్యం చెప్పారు. శనివారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో తన పార్టీ మద్దతుదారులతో ఆయన సమావేశమయ్యారు.
ల్యాండ్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren)కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఉపశమనం కలిగింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.
తాను ముఖ్యమంత్రి కావడమనేది ఊహాత్మకమని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య, జార్ఖండ్ ముక్తి మోర్చ నాయకురాలు కల్పన సోరెన్ స్పష్టం చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి (INDIA Bloc)వినూత్నంగా నిరసన తెలిపింది. ఆదివారం కూటమి ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్‌లో మెగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.