Home » Hungary
రాష్ట్రంలో గర్భిణీలు, చిన్నారులు, గిరిజనుల్లో పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరూ చనిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 544 గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమించేందుకు ప్రతిపాదిస్తూ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు.
సమాజంలో జరిగే నేరాలను ఉపేక్షిస్తే అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే హత్యలు, దోపిడీలు, లైంగిక దాడుల కేసుల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక చిన్నారులపై లైంగిక దాడి జరిగిందంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.