Home » IndiaVsEngland
:T20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ 2వ మ్యాచ్ ఈరోజు: గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత....
చివరిదైన ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ధర్మశాల టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. 41 ఏళ్ల వయసులోనూ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్‌ను అండర్సన్ పెవిలియన్ చేర్చాడు.
ఐదో టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. మూడో రోజు ఆటలో తొలి సెషన్లో 259 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు లంచ్ విరామ సమయానికే సగం వికెట్లు కోల్పోయింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల భారీ స్కోర్ వద్ద రోహిత్ సేన ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియాకు 259 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టుపై భారత్ పట్టుబిగించింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కలిసికట్టుగా రాణించడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. టాప్ 5 బ్యాటర్లు 50+ స్కోర్లతో దుమ్ములేపారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో భారత స్పిన్నర్లు అరుదైన రికార్డును నెలకొల్పారు. ఐదో టెస్టు తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేశారు. భారత స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయింది.
ప్రస్తుతం భారత క్రికెట్లో, జాతీయ రాజకీయాల్లో కామన్‌గా వినిపిస్తోన్న పేరు మహ్మద్ షమీ. టీమిండియాలో పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న షమీ గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి అందరికి దగ్గరయ్యాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసిన హిట్‌మ్యాన్ 13 ఫోర్లు, 3 సిక్సులతో 154 బంతుల్లో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది 12వ సెంచరీ.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ దుమ్ములేపారు. సెంచరీలతో పెను విధ్వంసం సృష్టించారు. 13 ఫోర్లు, 3 సిక్సులతో 154 బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీని పూర్తి చేసుకోగా.. 10 ఫోర్లు, 5 సిక్సులతో 137 బంతుల్లో గిల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.